ఆ సినిమా ప్రమోషన్ కోసం సమంత వస్తుందా?

నారా రోహిత్…ఈ యువ హీరో స్టైలే వేరు…ఎందుకంటే ఈ హీరో అయినా కమర్షియల్ గా హిట్ కొట్టాలి…లేదంటే కరియర్ అంతం అయిపోతుంది అని ఆలోచిస్తారు…కానీ మన నారా రోహిత్ అలా కాదు…జయాపజలతో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేయడమే కాకుండా వినూత్నమైన  కథలను ఎంచుకుంటూ ఎప్పటికైనా హిట్ కొట్టాలి అన్న పట్టుదలతో వరసపెట్టి సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక మైన గుర్తిపుకోసం తాపత్రయ పడుతున్నాడు. అయితే వరుస హిట్స్ తో దూసుకుపోతున్న రోహిత్ కి కాస్త అపజయాలు అడ్డంకుగా మారాయి…గత రెండు సినిమాలు నారా రోహిత్ కి నిరాశనే మిగిల్చాయి. లేటెస్ట్ గా వచ్చిన కథలో రాజకుమారుడు కూడ అపజయాన్నే అందుకోవడంతో రోహిత్ కెరియర్ పై అనుమానాలు మొదలు అయ్యాయి. దీనితో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని రోహిత్ కొత్త ప్లాన్ ని ఆచరణలో పెట్టాడు.

ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి అంటారా…ఒకసారి ఈ కధను చదవండి మీక్ అర్ధం అవుతుంది…విషయంలోకి వెళితే…త్వరలో విడుదల కాబోతున్న తన ‘బాలకృష్ణుడు’ సినిమాకు ప్రమోషన్స్ ని ఎక్కువగా చేయడానికి టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత హెల్ప్ తీసుకోబోతున్నాడు. ఈ రోజు ‘విజయదశమి’ సందర్భంగా  సమంత ద్వారా బాలకృష్ణుడు సినిమా టీజర్ ని లాంచ్ చేయిస్తున్నాడు రోహిత్. అదే విధంగా చిత్ర యూనిట్ సినిమా రిలీజ్ వరకు సమంతని కొన్నిసలహాలను అడుగుతున్నాడట రోహిత్. సోషల్ మీడియాలో సమంత  బాగా  చురుగ్గా  సందడి చేసే నేపధ్యంలో ‘బాలకృష్ణుడు’ సినిమాను సోషల్ మీడియాద్వారా సమంత చేత  ప్రమోట్ చేయిస్తున్నాడు. మరి సమంత చేస్తున్న ఈ ప్రచారం రోహిత్ కరియర్ కి ఎలాంటి మలుపుగా మారుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus