Samantha: స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్న సమంత!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సమంత ప్రస్తుతం ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈమె గతంలో మయో సైటిసిస్ వ్యాధి బారిన పడటంతో ఈ వ్యాధికి చికిత్స తీసుకోవడం కోసం అమెరికా వెళ్తున్నారు. అందుకే ఏడాది పాటు పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి సమంత అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఈమె పరేడ్ గ్రౌండ్లో నిర్వహించబోయే వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొనబోతున్నారని తెలుస్తుంది. అయితే ఇండియాలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో కాకుండా న్యూయార్కులో జరిగే స్వాతంత్ర దినోత్సవపు వేడుకలలో ఈమె ముఖ్య అతిథిగా పాల్గొనే అవకాశాన్ని అందుకున్నారు. ఆగస్ట్ 15న మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. అక్కడ అమెరికా కాలమాణం ప్రకారం ఆగస్ట్ 20 ఇండిపెండెంట్‌ డేకి సంబంధించిన పరేడ్‌ని నిర్వహిస్తున్నారు. న్యూయార్క్ సిటీలో జరగనుంది.

ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సమంతను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. 41వ వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్‌ని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సమంతతో పాటు ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ ఈ వేడుకలలో పాల్గొనబోతున్నారు. ఇలా న్యూయార్క్ లో జరిగే స్వాతంత్రపు దినోత్సవ వేడుకలకు సినీ సెలబ్రిటీలను పిలవడం చాలా అరుదుగా ఉంటుంది. అయితే సమంతను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు అంటే ఇది నిజంగానే సమంతకు దక్కిన గౌరవం అని చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus