అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తరువాత సమంత కెరీర్ పరంగా దూకుడు పెంచింది. ఓ పక్క వరుస సినిమాలు ఒప్పుకుంటూ ఆశ్చర్యపరుస్తోంది. మరోపక్క వెబ్ సిరీస్ లు, ఫొటోషూట్స్ అంటూ రచ్చ చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆమె ఓ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం గ్లామరస్ ఫోజులిచ్చింది. ‘ఎల్లే ఇండియా’ మ్యాగజైన్ కవర్ పై సమంత రెడ్ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది.
‘ఏ మాయ చేసావే’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత ఎదుర్కొన్న అనుభవాలను ఈ మ్యాగజైన్ లో చదివి తెలుసుకోండని చెబుతున్నారు. అలానే తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఈ మ్యాగజైన్ లో పంచుకున్నట్లు తెలుస్తోంది. ‘ఎల్లే ఇండియా’ మ్యాగజైన్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన తన ఫొటోనే సమంత కూడా రీట్వీట్ చేసింది. ‘ఈ మ్యాగజైన్ లో నా తొలి కవర్ ఫోటో’ అంటూ ఎగ్జైట్ అయింది సమంత.
అలానే ఎల్లే డిజిటల్ కవర్ స్టార్ పేరుతో ఉన్న మ్యాగజిన్ కవర్ పేజ్ లో కూడా సమంత ఫోటోను ప్రింట్ చేశారు. సౌత్ లో పందకొండేళ్ల సినీ కెరీర్ తరువాత ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సమంత ఎలా ప్రయాణం మొదలుపెట్టిందో తెలుసుకోండి అంటూ మ్యాగజైన్ పేర్కొంది.
My first @ELLEINDIA cover ♥️ yayyyyy .. https://t.co/Lkvsxsr04V
— Samantha (@Samanthaprabhu2) November 30, 2021
1
2
3
4
5
6
7
8
9
10
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?