Samantha: అన్నపూర్ణ స్టూడియోస్ కు వచ్చిన సామ్.. ఎందుకంటే?

  • November 25, 2021 / 03:20 PM IST

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విడాకుల ప్రకటన తర్వాత సమంత స్పెషల్ సాంగ్స్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటున్న సమంత తన మనస్సులోని భావాలను అభిమానులతో పంచుకుంటూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. సమంత నటిస్తున్న శాకుంతలం మూవీ షూటింగ్ కొన్ని నెలల క్రితమే పూర్తైన విషయం తెలిసిందే. ఈ సినిమా డబ్బింగ్ పనుల కోసం సమంత అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యక్షమయ్యారు.

చైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంత తొలిసారి అన్నపూర్ణ స్టూడియోస్ కు వచ్చారు. శాకుంతలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్నాయి. అక్కినేని ఫ్యామిలీకి చెందిన స్టూడియోకు సమంత రావడం అభిమానులను ఆశ్చర్యపరిచినా వ్యక్తిగత జీవితం, వృత్తిగత జీవితం వేరని సమంత భావిస్తున్నట్టు చెప్పకనే చెప్పేశారు. ఈ నెల 23వ తేదీన చైతన్య పుట్టినరోజు కాగా సమంత చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు. మరోవైపు ఫిట్ నెస్ పై దృష్టి పెట్టిన సమంత తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.

వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సమంత రెమ్యునరేషన్ ను భారీగా పెంచారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సమంత ఏకంగా కోటిన్నర రూపాయలు తీసుకున్నారని వార్తలు రావడం గమనార్హం. పలు ప్రముఖ కంపెనీలకు సమంత బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus