Samantha: చైతన్య జ్ఞాపకాల నుంచి బయటపడలేకపోతున్న సమంత..అదే ప్రూఫ్?

Advertisement

సమంత నాగచైతన్య విడిపోయి పది నెలలు కావస్తున్నా ఇప్పటికీ వీరి విడాకుల గురించి అలాగే వీరి విడాకులకు గల కారణాల గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. అయితే సమంత నాగచైతన్య ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోవడం ఎంతో మంది అభిమానులకు జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలి. సమంత కూడా ఈ విషయంపై స్పందిస్తూ విడాకుల సమయంలో తాను ఎంతో బాధలు అనుభవించానని ఆ సమయంలో తన జీవితం చాలా కష్టంగా మారిందని తెలియజేశారు.

ఇలా విడాకుల తర్వాత ఎవరి వృత్తిపరమైన జీవితంలో వారు బిజీగా ఉంటూ వరుస సినిమాలు చేస్తూ ఉన్నారు. అయితే నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత విడాకులు తీసుకొని విడిపోయిన తాను ఇంకా విడాకుల డిప్రెషన్ లో నుంచి బయటపడలేకపోతుందని తెలుస్తోంది. తాజాగా ఈమె ముంబై ఎయిర్ పోర్టులో సందడి చేశారు. ఇలా ముంబై ఎయిర్ పోర్టులో సమంత కనిపించగానే ఒక్కసారిగా కెమెరాలన్నీ తనని బంధించాయి. అయితే ఆ సమయంలో సమంత తన చేతిలో యు కెన్ హీల్ యువర్ లైఫ్ అనే బుక్ తో కనిపించారు.

ప్రముఖ రచయిత లూయిస్ హే రాసిన ఆ పుస్తకం చదవడం వల్ల మానసిక ఆందోళన నుంచి బయటపడవచ్చు. ఈ విధంగా సమంత ఆ పుస్తకంతో కనిపించడం వల్ల సమంత ఇప్పటికీ చైతన్య జ్ఞాపకాల వల్ల పూర్తిగా డిప్రెషన్ లో ఉండిపోయిందని ఇంకా తనని నాగచైతన్య జ్ఞాపకాలు వెంటాడుతున్నాయని అయితే ఆ డిప్రెషన్ నుంచి బయటపడటం కోసమే ఈమె ఆ పుస్తకం చదువుతోంది అంటూ పెద్ద ఎత్తున అభిమానులు భావిస్తున్నారు.

మొత్తానికి సమంత నాగచైతన్య ఏ చిన్న పని చేస్తున్న లేదా వీరి గురించి ఏ చిన్న విషయం తెలిసిన సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక సమంత సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె యశోద, శాకుంతలం, ఖుషి వంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus