సమంత అక్కినేని యోగా ఫోటో వైరల్..!

సినీ ఇండస్ట్రీలో ఉన్న నటీ నటులంతా.. డైట్లు ఫాలో అవ్వడం, ఎక్సర్ సైజ్ లు చెయ్యడం .. వంటివి రెగ్యులర్ గా చేస్తుంటారు. అలా చెయ్యకపోతే వారి మొహంలోనూ,ఫిజిక్ లోనూ మార్పులు వచ్చేస్తాయి. అలా జరిగితే ట్రోలింగ్ కు గురవ్వడం ఖాయం. ట్రోలింగ్ సంగతి పక్కన పెట్టేసినా.. సినిమా అవకాశాలు కరువయ్యే ప్రమాదం కూడా వాటిల్లుతుంది. కాబట్టి గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

ముఖ్యంగా హీరోల వర్కౌట్ల కంటే హీరోయిన్ల వర్కౌట్లు పీక్స్ లో ఉంటాయని సమంతను చూస్తే అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్ లు యోగాసనాలు కూడా చేస్తుంటారు అని అందరికీ తెలిసిన సంగతే. కానీ మన సమంత అయితే అతి కఠినమైన ఆసనం వేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సమంత చేతులను కింద పెట్టి.. శరీరం మొత్తాన్ని గాల్లో పెట్టేసింది. ఈ ఫోజ్ చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. సమంత డెడికేషన్ కు హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే.

గతంలో నటుడు మురళీ మోహన్ కూడా.. సమంత వర్కౌట్లు ఏ రేంజ్లో చేస్తుందో ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ‘100 కిలోల బరువులను కూడా సమంత లిఫ్ట్ చెయ్యడం చూశానని’ మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. ఇక సమంత యోగా చేస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ ఏడాది ‘జాను’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది సమంత. కోలీవుడ్ సూపర్ హిట్ అయిన ’96’ కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రంలో సమంత అద్భుతంగా నటించిందనే చెప్పాలి. ఇక త్వరలోనే ‘ఫ్యామిలీ మెన్ సీజన్ 2’ వెబ్ సిరీస్ లో కూడా సమంత నటించబోతుంది.

1

2

3

4

5

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus