స్టార్ హీరోయిన్ సమంత , నాగ చైతన్య తో విడాకుల తరువాత ‘మయోసైటిస్’ వ్యాధి బారిన పడటంతో సినిమాలకు కొంచం గ్యాప్ తీసుకున్నారు. ఆ తరువాత బాలీవుడ్ లో కొన్ని వెబ్ సిరీస్ లలో నటించారు. ఈ మధ్యనే టాలీవుడ్ లో ‘శుభమ్’ మూవీ నిర్మించి , విడుదల చేసి మంచి టాక్ సంపాదించుకున్నారు. ప్రఖ్యాత వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీమ్యాన్’ దర్శకుడు రాజ్ నిడిమోరు తో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత ఏడాది డిసెంబర్ 1న భూతశుద్ధి పద్ధతిలో వివాహం జరిగిన సంగతి అందరికి తెలిసిందే.
అయితే పెళ్లి అయిన మరునాటి నుంచే ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ లో పాల్గొంటున్నారు సమంత. పెళ్లి చేసుకొని తన వైవాహిక జీవితంలో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు హీరోయిన్ సమంత.ఇది ఇలా ఉండగా, తన కొత్త మూవీకి సంబందించిన ట్రైలర్ గురించిన అప్డేట్ ఒకటి యూనిట్ నుంచి అనౌన్స్ చేసారు, అదేంటంటే..
‘మా ఇంటి బంగారం’ నుంచి సమంత కి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో సమంత యాక్షన్ లుక్ లో కనిపించగా, లుక్ చాలా బాగుందని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ జనవరి 9న ఉదయం 10గంటలకు ‘మా ఇంటి బంగారం’ మూవీ నుంచి ట్రైలర్ విడుదల చేయబోతున్నట్టు అప్డేట్ ఇచ్చారు సమంత. కాగా ఈ సినిమాకి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, సమంత & భర్త రాజ్ నిడిమోరు తో కలిసి ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.