అసలే హీరోయిన్ అవకాశాలు లేవని తమన్నా బాధపడుతుంటే.. వచ్చే కొంత ఆదాయానికి సమంత చెక్ పెట్టింది. బాహుబలి సినిమాతో మరింత అవకాశాలు రావాల్సింది పోయి ఇలా అయింది ఏమిటి అంటూ.. తలపట్టుకుంటున్న మిల్కీ బ్యూటీకి బుల్లితెరపైనా కూడా ఛాన్స్ లేకుండా చేసింది క్యూట్ బ్యూటీ. అసలు విషయం లోకి వెళితే… జీ తెలుగు ఛానల్ అంబాసిడర్ గా కొన్నేళ్లుగా మిల్కీ బ్యూటీ తమన్నా కొనసాగింది. ప్రజల్లోకి ఈ ఛానెళ్ల వెళ్ళడానికి తనవంతు కృషి చేసింది. అయితే ఆమె హవా తగిపోవడం.. పైగా రెమ్యునరేషన్ పెంచేయడంతో తమన్నాని తొలగించి ఆ స్థానంలో సమంతను తీసుకున్నారు. ఒక హీరోయిన్ గానే కాకుండా తెలుగు ఇంటి కోడలు కావడంతో ఈ ఛాన్స్ సమంతకు వెళ్లినట్టు సమాచారం. 2018 నుంచి సమంత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనుంది.
ఈ మేరకు ఆమెతో అగ్రిమెంట్ కూడా పూర్తి చేసినట్లు టీవీ వర్గాలు తెలిపాయి. దీనికి గాను సమంత కోటి 50 లక్షలు అందుకున్నట్టు టాక్. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఛానెల్ లో పలు సీరియళ్లు, సినిమాలకు సమంత ప్రచారం చేయనుంది. ఆమెపై షూట్ చేసిన ప్రకటనలు జనవరి ఒకటి నుంచి ప్రసారం అవుతున్నాయి. ప్రస్తుతం సమంత తెలుగులో రంగస్థలం, మహానటి సినిమాలు చేస్తోంది. తమిళంలోనూ రెండు సినిమాలు చేస్తోంది. ఇవే కాకుండా కన్నడ మిస్టరీ సినిమా “యుటర్న్” రీమేక్ లో నటించడానికి సిద్ధమైంది. దీనిని నాగచైతన్యతో కలిసి తనే స్వయంగా నిర్మించనున్నట్టు తెలిసింది.