భర్త గురించి అడిగితే సమాధానం చెప్పని సమంత!

  • July 14, 2018 / 02:07 PM IST

టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత, నాగచైతన్య ని చూసిన బయటివారెవరైనా ప్రేమికులు అని అనుకుంటారు. భార్య భర్తలు అయినప్పటికీ ఆ బాధ్యత, అధికారాలను పక్కన పెట్టి.. ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారు. పెళ్ళికి ముందు మూడు సినిమాల్లో నటించిన ఈ జంట త్వరలోనే కలిసి మూవీ చేయనున్నారు. మీడియా ముందు వచ్చినప్పుడు ఒకరిగురించి ఒకరు చెప్పుకుంటుంటారు. కానీ ఈ మధ్య సమంత తన భర్త గురించి చెప్పడానికి వెనుకాడుతోంది. ఇదివరకు ప్రియుడు కాబట్టి ఎన్నెన్నో చెప్పేది.. ఇప్పుడు అక్కినేని కోడలిగా జాగ్రత్త పడుతోంది. ఎలా జాగ్రత్త పడిందో వివరాల్లోకి వెళితే.. రీసెంట్ గా హైదరాబాదులోని ఒక రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి సమంత హాజరైంది. అప్పుడు మీకు ఇష్టమైన ఫుడ్ ఏమిటని అడగగా.. హైదరాబాదీ బిర్యానీ అని చెప్పింది.

మరి మీ భర్త చైతూకి ఏదిష్టమో చెప్పమంటే మాత్రం చెప్పకుండా వెంటనే అక్కడి నుంచి సీరియస్ గా వెళ్లిపోయిందని సమాచారం. దీంతో రకరకాలుగా వార్తలు వ్యాపించాయి. చైతూకి సమంత కి గొడవ జరిగిందా? అని చర్చించుకున్నారు. కానీ అసలు విషయం అది కాదంట. మీడియాతో తన భర్తకు సంబంధించి వ్యక్తిగత వివరాలు చెప్పకూడదని నిర్ణయం తీసుకుందంట. అది మంచిదైనా సరే ఇంటి సంగతులు బయటికి రాకూడదని భావిస్తోంది. అందుకే కోపంగా వెళ్లిపోయినట్లు టాక్. సో ఇక నుంచి సమంతని సినిమాల విషయాలను మాత్రమే అడగాలన్న మాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus