విజయ్ దేవరకొండ సమంత జంటగా నటించిన చిత్రం ఖుషి. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఖుషి మ్యూజిక్ కన్సర్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సమంత పాల్గొని సందడి చేశారు. విజయ్ దేవరకొండతో కలిసి డాన్స్ కూడా చేశారు. ఇలా ఈ కార్యక్రమంలో సందడి చేసినటువంటి సమంత అనంతరం వేదికపై మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఈ సినిమా కోసం తాను కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఇక సమంత తన ఆరోగ్యం గురించి కూడా ఈ కార్యక్రమంలో ప్రస్తావానికి తీసుకువచ్చారు అయితే ఈ కార్యక్రమంలో ఈమె మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ పలువురికి సందేహాలను కలిగిస్తున్నాయి. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ దేవుడి దయ వల్ల నాకు విజయవాడలో ఇడ్లీ స్టాల్ పెట్టుకునే పరిస్థితి రాలేదుఅంటూ కామెంట్ చేశారు.
ఇలా సమంత ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారన్న విషయంపై పలువురు పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేశారు. బహుశా ఈమె అనారోగ్యానికి గురైన సమయంలో ఎవరైనా తనని ఇలాంటి మాటలతో విమర్శలు చేశారా అందుకే సమంత ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. సమంతను ఇలాంటి మాటలతో ఎవరైనా ఇబ్బంది పెట్టారా అందుకే వారికి కౌంటర్ ఇచ్చే క్రమంలోనే సమంత ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
ఏది ఏమైనా సమంత (Samantha) మాత్రం తనను విమర్శించిన వారికి భారీగానే కౌంటర్ ఇస్తూ సమాధానాలు చెబుతున్నారు. ఇక ఈమె అనారోగ్యం కారణంగా ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఖుషి సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్లకు హాజరయ్యారు.
జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!