Samantha: స్టార్ హీరోయిన్ పై సమంత అభిమానం!

  • June 11, 2021 / 05:55 PM IST

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత పెళ్లి తరువాత నటిగా మరింత బిజీ అయింది. సాధారణంగా పెళ్లైన హీరోయిన్లకు ఇండస్ట్రీలో అవకాశాలు పెద్దగా రావు. కానీ సమంత మాత్రం భారీ సినిమాలు, వెబ్ సిరీస్ లను అంగీకరిస్తూ ఎప్పుడూ లేనంత బిజీ అయింది. ఇటీవల ఆమె నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా సమంత నటనకు అందరూ ఫిదా అయిపోయారు.

ఈ క్రమంలో బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన సమంత.. స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఎంతోమందికి ఫ్యాషన్‌ ఐకాన్‌గా నిలిచే సమంత తనకు మాత్రం దీపికా పదుకోన్ స్ఫూర్తి అని చెబుతోంది. దీపికా డ్రెస్సింగ్ సెన్స్, ఆమె స్టైల్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన సామ్.. ఈ విషయంలో దీపికాను కాపీ కొడతానని ఓపెన్ గా చెప్పింది. దీపిక ఎంతో అందంగా ఉంటుందని, ఆమె మనిషి రూపంలో ఉన్న దేవతనా? అని అనుకునేదాన్నని చెప్పుకొచ్చింది.

ఇక సమంత కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus