Samantha: జనవరి నెల జ్ఞాపకాలు షేర్ చేసిన సమంత.. వైరల్ అవుతున్న ఫోటోలు..

స్టార్ హీరోయిన్ సమంత 2023 మొదటి నెల జనవరికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకాభిమానులతో షేర్ చేసుకుంది. సామ్ గతకొద్ది కాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల వ్రిశాంతి అనంతరం తిరిగి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతుంది. ఇటీవల ‘యశోద’ మూవీతో హిట్ అందుకున్న సమంత.. గుణ శేఖర్ దర్శకత్వంలో నటించిన ‘శాకుంతలం’ త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ పక్కన ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌లో కనిపించనుంది.

దీనికి సంబంధించిన స్క్రిప్ట్ డిస్కషన్ తాలుకు పిక్స్ పోస్ట్ చేసింది. అలాగే గడిచిన ఏడు నెలల కాలంలో జరిగిన మూమెంట్స్ అన్నిటినీ వరుసగా షేర్ చేసింది. అలాగే సమంతకు డబ్బింగ్ చెప్పే సింగర్ చిన్మయి శ్రీపాద, ఆమె భర్త రాహుల్ కూడా అనారోగ్యంతో సామ్ ఎంత ఇబ్బంది పడిందో తెలియజెప్తూ.. ఆమెకు ధైర్యం చెప్తూ ఎమోషనల్ మెసేజ్ చేశారు. సామ్ పంచుకున్న జనవరి నెల జ్ఞాపకాలకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus