Samantha: రాళ్లూరప్పలు అంటూ సమంత షాకింగ్ కామెంట్స్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత సినిమాలకు 12 నెలల పాటు బ్రేక్ ఇచ్చినా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ అణువంతైనా తగ్గలేదు. సమంత నటించిన ఖుషి సినిమా, సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలో విడుదల కానుండగా ఈ రెండు ప్రాజెక్ట్ లు సమంత క్రేజ్ ను పెంచుతున్నాయి. అయితే సమంత గురించి గాసిప్స్ తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఒక స్టార్ హీరో సమంతకు 25 కోట్ల రూపాయలు ఇచ్చారని వార్తలు వినిపించాయి.

ఈ వార్తలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటంతో సమంత సోషల్ మీడియా వేదికగా స్పందించి తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. సమంత తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో మయోసైటిస్ వ్యాధి చికిత్స కోసం 25 కోట్ల రూపాయలా? ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నారు. మీరు చెప్పిన మొత్తంతో పోల్చి చూస్తే తక్కువ మొత్తమే ఖర్చు చేస్తున్నందుకు నేను హ్యాపీగా ఉన్నానని సామ్ అన్నారు.

నేను సినిమాల్లో వర్క్ చేసినందుకు రాళ్లూరప్పలు ఇవ్వలేదని నేను భావిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. నా దగ్గర డబ్బు ఉందని నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలనని సామ్ పేర్కొన్నారు. మయోసైటిస్ వ్యాధి వల్ల వేల మంది బాధ పడుతున్నారని సమంత చెప్పుకొచ్చారు. మయోసైటిస్ వ్యాధి చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చేముందు బాధ్యతగా ఉండాలని ఆమె చెప్పుకొచ్చారు.

సమంత కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండగా సమంత రెమ్యునరేషన్ 5 కోట్ల రూపాయలుగా ఉంది. సమంత పూర్తిస్థాయిలో కోలుకుని షూటింగ్ లతో బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే సమంత రేంజ్ మరింత పెరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వయస్సు పెరుగుతున్నా సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus