ఐదేళ్ళపాటు ప్రేమలో మునిగి తేలిన అక్కినేని నాగచైతన్య సమంత రూత్ ప్రభు ఇద్దరు కూడా అంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక మరో ఐదేళ్ల దాంపత్య జీవితానికి వాళ్ళు ఇటీవల ముగింపు పలికిన విధానం కూడా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ స్టార్ కపుల్స్ ఎందుకు విడిపోయారు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఒక విధంగా వీరు మళ్ళి కలుసుకోవాలని కూడా అభిమానులు సోషల్ మీడియా ద్వారా చాలా బలంగా కోరుకుంటున్నారు.
కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు అని చాలా ఈజీగా అర్థం అయిపోయింది. ఇక నిత్యం వీరికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక గతంలో నాగచైతన్య మంచితనాన్ని గురించి సమంత చెప్పిన ఒక వీడియో కూడా ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. నాగచైతన్య హస్బెండ్ మెటీరియల్ అంటూ ఒకసారి మా అమ్మకు ఫోన్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేకపోతే అప్పుడు చైతన్య వెంటనే ఫోన్ ఇచ్చి ఎంతసేపైనా మాట్లాడుకో.. అని చెప్పాడు.
నాగచైతన్య నిజంగా పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అంటూ సమంత ఇంటర్వ్యూలో పొగడ్తల వర్షం కురిపించింది. ఇక అందుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. నిజంగా వారు విడిపోవడం పై అభిమానులు కూడా విచారం వ్యక్తం చేశారు. కానీ సొంత వ్యక్తిగత నిర్ణయం అనేది వారి ఇష్టం అని అందులో ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం సమంత బాలీవుడ్ ఇండస్ట్రీ లో బిజీ అయ్యేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఇప్పటికే ఆమె అమెజాన్ ప్రైమ్ కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ 2 దర్శకులు రాజ్ & డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ వెబ్ కంటెంట్ పై అంచనాలు భారీ గానే ఉన్నాయి. అలాగే సమంత గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన శాకుంతలం సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!