యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రియురాలు, కాబోయే భార్య సమంత తన పనులతో అక్కినేని అభిమానులకు కోపం తెప్పిస్తోంది. కొన్ని నెలల క్రితం వీరి ఇద్దరి ప్రేమను ఒప్పుకున్న నాగార్జున పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది జనవరి 29న ప్రేమ పక్షుల నిశ్చితార్థం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆనందంలో చైతూ బ్యాచిలర్ పార్టీలతో హడావుడి చేస్తుంటే, సమంత మాత్రం వేరే విధంగా ఎంజాయ్ చేస్తోంది. క్రిస్మస్ సందర్భంగా చైతూ తో కలిసి అందమైన బీచ్ కి వెళ్లిన స్యామ్ బికినీ వేసుకొని ఫోటోలు దిగింది. వాటిని ఈ రోజు సోషల్ మీడియాలో పెట్టి చర్చకు తెరలేపింది.
అందాలు ఆరబోస్తున్న క్రేజీ బ్యూటీని చూసిన కొంతమంది సో సెక్సీ అంటూ కితాబు ఇస్తుంటే మరికొంతమంది మాత్రం సమంత ఏంటి? ఈ పనులు అని విమర్శిస్తున్నారు. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం.. కొన్నిరోజుల్లో కోడలిగా అక్కినేని ఇంట అడుగు పెట్టబోతున్నావు.. ఇలా చేయడం మంచిదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. నాగార్జున పరువు తీస్తున్నావు అంటూ గోల పెడుతున్నారు. ఇవేవి తనకు పట్టనట్టుగా సమంత అమాయకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతోంది. మరి ఈ ఫోటోలు చూసి మీరు ఆస్వాదిస్తారా? విమర్శిస్తారో.. అది మీ ఇష్టం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.