Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత, కెరీర్‌లో ఒక దశలో వరుస ప్రాజెక్టులతో బిజీగా కొనసాగినా, వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం ఇండస్ట్రీకి దూరమయ్యారు. మళ్లీ తిరిగి సినిమాల్లో నటిస్తూ, మరోవైపు నిర్మాతగా కూడా రాణిస్తుంది సామ్. తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం మా ఇంటి బంగారం షూటింగ్‌లో సమంత పూర్తిగా బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆమె స్వంత నిర్మాణంలో రూపొందుతుంది.

Samantha

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత, తాజాగా తన వర్కౌట్స్‌కు సంబంధించిన ఫోటోను షేర్ చేయడంతో నెటిజన్ల దృష్టంతా ఆమెపై పడింది. జిమ్ ట్రైనర్‌తో దిగిన ఈ ఫోటోపై ఒక నెటిజన్ “ఎక్కువ వ్యాయామం మంచిది కాదు” అంటూ సూచించగా, సమంత వెంటనే “మీ సలహా అవసరం అయితేనే అడుగుతాను” అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొంతమంది నెటిజన్లు సమంత ఆరోగ్యం కోసం మాత్రమే ఈ సూచన చేశారని అంటున్న కూడా, మరికొందరు సమంతకు మద్దతుగా నిలిచారు. మరొక అభిమాని “ఏదైనా సినిమా కోసమే ఇలా వర్కౌట్ చేస్తున్నారా?” అని ప్రశ్నించగా, సమంత ‘షాక్’ ఎమోజీతో ఫన్నీగా స్పందించారు.

ఇకపోతే, రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక కొత్త ప్రాజెక్ట్‌లో సమంత నటించబోతున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అదనంగా, ఆమె క్లాతింగ్ మరియు పర్ఫ్యూమ్ బిజినెస్‌లలో కూడా అడుగుపెట్టారు. ఇలా నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా సమంత తన జర్నీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

రియల్ లైఫ్ సావిత్రిలా కీర్తి సురేష్ రిస్కీ ప్లాన్

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus