Samantha: మరో సమస్యతో బాధపడుతున్న సమంత.. అందుకే అమెరికా వెళ్లారా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి సమంత నాగచైతన్య పెళ్లి చేసుకోవడం తన నుంచి విడాకులు తీసుకొని విడిపోవడం జరిగింది. ఇలా విడాకులు తీసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలపై తన దృష్టి పెట్టినటువంటి ఈమె జీవితంలో ఊహించని విధంగా మయోసైటిస్ అనే ఒక భయంకరమైన వ్యాధి బారిన పడ్డారు అయితే ఈ వ్యాధి నుంచి సమంత క్రమక్రమంగా కోలుకొని తిరిగి సినిమాలలోకి వచ్చారు.

ఇలా మయోసాటిసిస్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సమంతా పూర్తిగా నయం కాకుండానే సినిమాలలోకి వచ్చి తాను కమిట్ అయినటువంటి సినిమాలన్ని పూర్తిచేసి ప్రస్తుతం ఏడాది పాటు సినిమా ఇండస్ట్రీకి విరామం ప్రకటించారు. ఇలా ఇండస్ట్రీకి విరామం ఇచ్చినటువంటి ఈమె గత కొంతకాలంగా అమెరికాలో ఉండి తిరిగి ఇండియా చేరుకున్నారు అయితే సమంత మయోసైటిస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇవ్వలేదని తెలుస్తుంది.

ఈమె మయోసైటిసిస్ నుంచి కోలుకున్నారని అయితే మరొక వ్యాధితో సమంత బాధపడుతున్నారని అందుకే ఈమె అమెరికాలో కొద్దిరోజుల పాటు ఉండే ట్రీట్మెంట్ తీసుకున్నారని తెలుస్తుంది. అయితే ఈ సమస్య భయంకరమైనది కాకపోయినప్పటికీ ఈమె ఎక్కువగా వర్కౌట్ చేయడం వల్లే ఈ విధమైనటువంటి సమస్యకు గురై అయ్యారు అంటూ మరొక వార్త గురించి సోషల్ మీడియాలో సంచలనగా మారింది. మరి సమంత గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ సమంత మాత్రం త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక సమంత చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమాలకు కూడా కమిట్ అవ్వలేదు ప్రస్తుతం తన ఆరోగ్యం పై దృష్టి పెట్టి ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఇక ఈమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus