నాగార్జున, నాని సినిమాలో సమంత

నాగ‌చైత‌న్య‌ని వివాహం చేసుకొని అక్కినేని కోడ‌లిగా ప్ర‌మోష‌న్ అందుకున్న స‌మంత ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. తెలుగులో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న రంగ‌స్థ‌లంలో న‌టించిన సామ్ మ‌హాన‌టిలోను న‌టిస్తుంది. ఇక ఇప్పుడు నాగ్‌-నాని మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంలోను ఓ పాత్ర పోషించ‌నుంద‌ని తెలుస్తుంది. భలేమంచి రోజు, శమంతకమణి సినిమాల డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్ తెరెక్క‌నుండగా ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 24న పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకోనుంది. లాంచ్ అయిన కొద్ది రోజుల‌లోనే సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నారు. సి. అశ్వినీద‌త్ నిర్మాణంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో నాగార్జున డాన్‌గా క‌నిపిస్తాడ‌ని, నాని డాక్ట‌ర్ పాత్ర పోషించ‌నున్నాడ‌ని అంటున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా కోసం ఇప్ప‌టికే శ్ర‌ద్ధా శ్రీనాథ్‌ని క‌థానాయిక‌గా తీసుకున్నారని తెలుస్తుండ‌గా, మ‌రో క‌థానాయిక కోసం అన్వేష‌ణ జ‌రుగుతుంది.

మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంలో స‌మంత కీల‌క పాత్ర పోషించ‌నుంద‌ని రూమ‌ర్స్ వ‌స్తున్నాయి. గ‌తంలో నాగ్ న‌టించిన మ‌నం, రాజు గారి గ‌ది 2 చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషించిన స‌మంత ఈ చిత్రంలో ఎలాంటి పాత్ర పోషంచ‌నుంది అనే దానిపై అభిమానుల‌లో ఆస‌క్తి నెల‌కొంది. దీనిపై క్లారిటీ రావ‌లసి ఉంది. ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందించ‌నున్నాడు. నాని స‌ర‌స‌న ఈగ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించిన స‌మంత మ‌ల్టీ స్టార‌ర్ మూవీలో నానితో జ‌త క‌డుతుందా లేదంటే కీల‌క పాత్ర చేస్తుందా అనే దానిపై జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. నాని నిర్మాణంలో రూపొందిన అ మూవీ ఈ రోజు విడుద‌ల కానుండ‌గా, ఆయ‌న న‌టిస్తున్న కృష్ణార్జున యుద్ధం ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. ఇక నాగ్ .. వ‌ర్మ సినిమాతో బిజీగా ఉన్న విష‌యం విదిత‌మే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus