సమ్మర్ లో సమంత హంగామా

సహజంగా హీరోయిన్స్ కి పెళ్లి అయితే వారి కెరీర్ వేగం తగ్గడమో.. పూర్తిగా ఆగిపోవడంతో జరుగుతాయి. ఇందుకు భిన్నంగా సమంత దూసుకుపోతోంది. ఆమె ఈరోజు కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంది. కన్నడ లో హిట్ సాధించిన “యు టర్న్” చిత్రాన్ని తెలుగు రీమేక్ లో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ వైజాక్ లో మొదలయింది. దీంతో పాటు ఈనెల్ 24 నుంచి నాగార్జున, నాని మల్టీ స్టారర్ సినిమా షూటింగ్ లో జాయిన్ కానుంది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ “సూపర్‌ డీలక్స్” అనే చిత్రంలో విజయ్‌కి జోడీగా నటిస్తోంది. ఈ మూడు సెట్స్ మీద ఉంటే.. మరో మూడు సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. సమ్మర్ లో రిలీజ్ కానున్న ఈ చిత్రాలతో క్యూట్ బ్యూటీ సందడి చేయనుంది.

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో తొలిసారి సమంత నటించిన “రంగస్థలం” మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో రామలక్ష్మిగా యువకుల గుండెలకు గాయం చేయనుంది. అలాగే సమంత జమునగా నటించిన సావిత్రి బయోపిక్ “మహానటి” మార్చి 29 న రిలీజ్ కానుంది. ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ పనుల్లో ఆలస్యం అయితే వారం తరువాత అయినా విడుదలకానుంది. ఇక విశాల్ పక్కన నటించిన తమిళ చిత్రం “ఇరుంబు తిరై (అభిమన్యుడు)” మార్చి 29న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కావడానికి అంతా సిద్ధం చేశారు. దీంతో వేసవి సమయంలో ఏ థియేటర్లో చూసినా సమంతనే కనిపించనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus