తెలుగులో అదరగొడుతున్న యు టర్న్ అక్కడ డిజాస్టర్

“రంగస్థలం, మహానటి” చిత్రాల తర్వాత సమంత నటించగా గతవారం విడుదలైన “యు టర్న్” తెలుగులో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మొదటి వారం కలెక్షన్స్ కాస్త వీక్ గా ఉన్నప్పటికీ.. సెకండ్ వీక్ లో బాగా పుంజుకొని స్టడీ కలెక్షన్స్ తో థియేటర్స్ లో రన్ అవుతోంది. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడుతున్న “యు టర్న్” తమిళంలో మాత్రం ఫ్లాప్ గా డిక్లేర్ చేయబడింది. తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో షూట్ చేయడమే కాకుండా ఏకకాలంలో విడుదల చేశారు. అందుకోసమే.. తెలుగు-తమిళ భాషల్లో పరిచయమున్న ఆర్టిస్టులను సెలక్ట్ చేసుకొన్నారు.

కట్ చేస్తే.. టీం వ్యయప్రయాసలన్నీ నీరుగారాయి. తెలుగులో పర్వాలేదనిపించుకొన్న “యు టర్న్” తమిళ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. థ్రిల్లర్ చిత్రం కావడం.. ఎమోషనల్ కంటెంట్ ఉన్నా సెంటిమెంట్స్ కి పెద్దగా వేల్యూ లేకపోవడంతో తమిళ ఆడియన్స్ మాత్రం ఈ చిత్రాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో తమిళంలో ఈ చిత్రాన్ని సమంత స్టార్ డమ్ & పాపులారిటీని చూసి కొన్న డిస్ట్రిబ్యూటర్స్ షాక్ అయ్యారు. పైగా.. సమంత నటించిన మరో తమిళ చిత్రం “సీమ రాజా” కూడా డిజాస్టర్ అవ్వడంతో తమిళంలో సామంతకి ఒకేవారం రెండు ఫ్లాప్స్ వచ్చి ఖాతాలో చేరాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus