Vijay,Samantha: విజయ్ దేవరకొండ వీడియో కాల్ లో సమంతతో ఏమి మాట్లాడారంటే?

  • August 28, 2023 / 07:47 PM IST

విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా సమంత విజయ్ చేసిన డాన్స్ మ్యూజిక్ కన్సర్ట్ సినిమాపై మరింత హైప్ ను తీసుకొచ్చాయి.కాగా, రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సామ్, విజయ్ ప్రమోషన్స్ జోరును పెంచేశారు..

అనారోగ్యం వల్ల సమంత మొత్తం ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయినా.. కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చి సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకుంది. ఇక ప్రమోషన్స్ చేయడంలో విజయ్ దేవరకొండ తర్వాతే ఎవరైనా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అభిమానులు ఎలాంటి కంటెంట్ అయితే కోరుకుంటారో.. అలాంటి కంటెంట్ తోనే ప్రమోషన్స్ చేస్తూ ఉంటాడు. తాజాగా అర్ధరాత్రి సమంత కు వీడియో కాల్ చేసి మాట్లాడిన వీడియోను షేర్ చేశాడు.

సామ్ కి కాల్ చేసి నాక్ నాక్ జోక్ చెప్దామని కాల్ చేసినట్లు తెలిపాడు. ఇక ఇందులో సమంత అర్ధరాత్రి ఒకటిన్నర అయ్యిందని, ఇప్పుడు జోక్ ఏంటి అని అడగడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అర్ధరాత్రి సమంత వీడియో కాల్ చేయడమే కాకుండా నిన్ను మిస్ అవుతున్నాను అంటూ విజయ్ (Vijay) చెప్పడంపై అభిమానులు ఫైర్ అవుతున్నారు.

ఇక మరికొందరు అసలు సామ్ ఆ వీడియో కాల్ మాట్లాడింది లేదని, అది సెల్ఫీ వీడియో అని చెప్పుకొస్తున్నారు. అది ఆమె గ్లాసెస్ లో కనిపిస్తుందని చెప్తున్నారు. వీడియో కాల్ లా చూపిద్దామనుకున్నా.. సామ్ ఈ విషయంలో అడ్డంగా దొరికిపోయిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus