టాలీవుడ్ సెలబ్రిటీల్లో ఒక్కొక్కరికి ఒక్కో రకం ఆసక్తులు ఉంటాయి. వాటి కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. అలా కొందరికి కార్ల పిచ్చి, ఇంకొందరికి బైక్‌ల పిచ్చి, మరికొందరికి వాచీల పిచ్చి ఉంటుంది. ఆఖరిగా చెప్పిన వాచీల పిచ్చి ఉన్న స్టార్ల లిస్ట్‌లో సమంత కూడా చేరిందా? ఏమో ఆమె రీసెంట్‌గా బయటకు వచ్చినప్పుడు పెట్టుకున్న వాచీ చూశాక, దాని ధర విన్నాక నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే ఆ వాచీ ధర సుమారు రూ.20 లక్షలు అంటున్నారు.
‘సిటడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ ప్రచారంలో భాగంగా సమంత ఇప్పుడు వరుసగా మీడియా ముందుకు వస్తోంది. ఈ సిరీస్ ఈ నెల 7న స్ట్రీమ్ కానున్న నేపథ్యంలో వరుగసా ప్రెస్ మీట్‌లు, వీడియోలు అంటూ తెగ సందడి చేస్తోంది. అలా ఓ కార్యక్రమం కోసం సమంత (Samantha) బయటకు వచ్చినప్పుడు పాము లాంటి వాచీ ఒకటి పెట్టుకుంది. ఇప్పుడు దాని గురించి చర్చ జరుగుతోంది. ఎందుకంటే దాని ధర రూ. 20 లక్షలు అని అంటున్నారు.
‘సిటడెల్: హనీ బన్నీ’ ప్రీమియర్‌కి వచ్చినప్పుడే ఆ వాచీని సమంత ధరించింది. హై హీల్స్, గోల్డెన్ కలర్ కలర్ డ్రెస్‌లో సామ్ మెరిసిపోయింది. ఈ క్రమంలో చేతికి ఓ చిన్న పాము చుట్టినట్లు వాచీ పెట్టుకుంది. BVLGARI సంస్థకు చెందిన సర్‌పెంటీ టుబోగాస్ వాచీగా దానిని నెటిజన్లు గుర్తించారు. ఆ వాచీ ఆన్‌లైన్ లెక్క ప్రకారం అయితే.. రూ. 19, 27,000. ఈ లెక్క తెలిసేసరికి వామ్మో అంటున్నారు నెటిజన్లు.
ఇక ఇలాంటి వాచీల పిచ్చి టాలీవుడ్‌లో తారక్‌కి కూడా ఉంది. ఆయన కూడా భారీ ధర ఉన్న రిస్ట్ వాచీలను ధరించి ఈవెంట్లకు వస్తుంటారు. అప్పుడు కూడా ఇలానే నెటిజన్లు ఆ వాచీల గురించి సెర్చ్ చేసి మరీ వివరాలు తెలుసుకుంటూ ఉంటారు. దీంతో సమంతా.. నీకు కూడా తారక్‌లా వాచీల ఫాంటసీ ఉందా అని అంటున్నారు.