మండే ఎండల్లో నేను నటించను అంటున్న సమంత!!

  • July 24, 2017 / 10:25 AM IST

ఒక రేంజ్‌కు ఎదిగిన తరువాత హీరో అయినా, హీరోయిన్ అయినా కండిషన్స్ పెట్టడం కామన్. పెళ్లి దగ్గర పడుతున్న సమంత నటనకు మాత్రం గ్యాప్‌ ఇవ్వలేదు. విరామం లేకుండా తమిళ, తెలుగు భాషల్లో ఎడా పెడా నటించేస్తుంది. తమిళంలో పొన్ రాం దర్శకత్వంలొ శివకార్తికేయన్ జంటగా తెన్ కాశీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. కొద్ది రోజుల క్రితమే ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న సమంత తొలిరోజునే దర్శకుడిని పిలిచి కండిషన్ పెట్టారట.

సమంతకి స్కిన్ ఎలర్జీ ఉంది, పలుమార్లు చికిత్స చేయించుకున్నా అది పూర్తిగా తగ్గలేదని సమాచారం. సమంత ఈ సమస్య కారణంగా తాజాగా నటిస్తున్న చిత్ర దర్శకుడు పొన్ రాంను పిలిచి మండే ఎండల్లో తాను నటించను. అంతకు ముందే తనకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించండి. మళ్లీ ఎండ తగ్గు ముఖం పట్టిన తరువాత తాను నటిస్తాను అని షరతులు పెట్టారట. అదే విధంగా తాను నటిస్తున్నప్పుడు తనకు ఎండ తగలకుండా పైన క్లాత్‌ ఏర్పాటు చేయాలని కండిషన్ పెట్టారట.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus