సమంత కట్టిన చీర చెంగులో దాగిన లవ్ స్టోరీ

  • January 30, 2017 / 11:41 AM IST

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత తన ప్రేమ సంగతిని బయట పెట్టడం దగ్గరనుంచి నిశ్చితార్ధం వరకు క్రేజీ గా ప్రవర్తించింది. పజిల్ తో మొదలు పెట్టిన లవ్ స్టోరీ ని చీర చెంగుతో ముగించింది. ఆదివారం రాత్రి నాగచైతన్య, సమంతల నిశ్చితార్ధం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో బంగారు వర్ణం అంచు కలిగిన తెలుపు చీరలో సమంత ఆకర్షణీయంగా కనిపించింది. ముంబయికి చెందిన డిజైనర్‌ క్రేషా బజాజ్‌ ఈ చీరని డిజైన్‌ చేశారు. డిజైనర్‌ ప్రతిభకు తోడు స్యామ్ ఆలోచన తోడవ్వడంతో ఈ చీర ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ చీర చెంగులో తమ ప్రేమ కథలోని కీలక ఘట్టాలను ఎంబ్రాయిడీగా వేసి సమంత ప్రేమను చాటుకుంది.

ప్రేమ చిగురించడానికి కారణమైన ఏమాయ చేసావే సినిమాలోని ఓ సన్నివేశానికి చెందిన ఆర్ట్ తో పాటు తాజాగా ఓ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నప్పటి ఫోటో ని కూడా చీర చెంగులో మధుర జ్ఞాపకంగా చేతితో కుట్టు  వేయించుకుంది. వీటితో పాటు బైక్‌పై సమంత, చైతన్య కలిసి ఉన్న చిత్రం, ప్రేమమ్ మూవీ స్టిల్ కూడా కనిపిస్తుంది. ఇలా నాగచైతన్యపై ఉన్న ప్రేమనంతా కొంగులో నింపుకుని.. ఆకొంగుతో చైతూని కట్టేసుకోవడానికి సిద్ధమయిపోయింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus