Shaakuntalam: సమంత సినిమా ఏప్రిల్ కి వెళ్లింది!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమాను ఫిబ్రవరి 17న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే ఇప్పటివరకు వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. లేదంటే చెప్పిన సమయానికి సినిమాను రిలీజ్ చేసేవారు. అయితే ఇప్పుడు సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఏప్రిల్ 13 అయితే పెర్ఫెక్ట్ డేట్ అని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు. అదే సమయంలో రావాల్సిన చిరంజీవి ‘భోళా శంకర్’, రజినీకాంత్ ‘జైలర్’ రెండూ వాయిదా పడడంతో ఇదే మంచి అవకాశమని..

ఫిబ్రవరి 13న ఫిక్స్ చేశారట. దీనిపై అధికార ప్రకటన రానుంది. మరో రెండు నెలల సమయం ఉంది కాబట్టి ప్రమోషన్స్ బాగా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం సమంత ముంబైలో ‘సిటాడెల్’ షూటింగ్ లో బిజీగా ఉంది. ‘శాకుంతలం’ ప్రమోషన్స్ లో పాల్గొనడానికి మరింత సమయం ఉంది కాబట్టి అప్పటికి ఆమె తిరిగి వచ్చేస్తుంది. విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమా షూటింగ్ లో పాల్గొనడంతో పాటు ‘శాకుంతలం’ సినిమాకి కూడా సరిపడా సమయాన్ని కేటాయించవచ్చు.

త్రీడీ టెక్నాలజీలో రూపొందిన ‘శాకుంతలం’ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ రేంజ్ లో అంచనాలు పెంచడానికి సరిపోయే విధంగా మరో కొత్త వెర్షన్ ని సిద్ధం చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా రెండు నెలల సమయం ఉంది కాబట్టి.. మెల్లగా పాటలను రిలీజ్ చేసి శ్రోతలను ఆకట్టుకోనున్నారు. నిజానికి మార్చి 17న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ..

అది సానుకూలమైన డేట్ కాకపోవడంతో ఫైనల్ గా ఏప్రిల్ కి వెళ్లే సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘యశోద’ సక్సెస్ తరువాత సమంత నుంచి వస్తోన్న పాన్ ఇండియా సినిమా కావడంతో బిజినెస్ బాగానే జరుగుతోంది. మరి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus