Sameera Reddy: ఆ కామెంట్ల వల్ల ఒత్తిడికి గురయ్యాను.. సమీరారెడ్డి చెప్పిన విషయాలివే!

  • June 10, 2024 / 05:01 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా అగ్ర హీరోలకు జోడీగా నటించడం వల్ల సమీరారెడ్డికి (Sameera Reddy) మంచి పేరు వచ్చింది. వేర్వేరు కారణాల వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైన ఈ బ్యూటీ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. కెరీర్ పరంగా టాప్ లో ఉన్న సమయంలో నాపై ఒత్తిడి ఒకింత ఎక్కువగానే ఉండేదని ఆమె పేర్కొన్నారు. కొంతమంది ఆ సమయంలో బ్రెస్ట్ ఇంప్లాటేషన్ చేయించుకోవాలని చెప్పారని ఆమె తెలిపారు.

అందరూ అలాంటి సర్జరీ చేయించుకుంటున్నారని మీరు కూడా చేయించుకోవాలని సూచనలు చేశారని ఆమె చెప్పుకొచ్చారు. అలాంటి సర్జరీ చేయించుకోవడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదని సమీరారెడ్డి తెలిపారు. మన లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదని ఆమె అన్నారు. ఎవరైతే ప్లాస్టిక్ సర్జరీ, బొటాక్స్ చేయించుకుంటారో వాళ్లను నేను తప్పుబట్టనని సమీరారెడ్డి పేర్కొన్నారు. నా జీవితంలో మాత్రం ఏవైనా సమస్యలు ఉంటే వాటిని నేను అంతర్గతంగా పరిష్కరించుకోగలనని సమీరారెడ్డి పేర్కొన్నారు.

నటిగా ఉన్న సమయంలో నా శరీరంలో మార్పులు రావడంతో కొందరు సర్జరీకి సంబంధించి సూచనలు ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చారు. సర్జరీ గురించి కామెంట్లు చేసిన సమయంలో నేను చాలా ఒత్తిడికి గురయ్యానని సమీరా రెడ్డి వెల్లడించడం గమనార్హం. సమీరారెడ్డికి ఎదురైన చేదు అనుభవాల గురించి తెలిసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు. స్టార్ హీరోయిన్ కే ఇలాంటి అనుభవం ఎదురైతే సాధారణ హీరోయిన్లకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సమీరారెడ్డి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా విజయవంతంగా కెరీర్ ను కొనసాగించే ఛాన్స్ ఉంటుంది. సమీరారెడ్డికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికీ ఆఫర్లు వస్తున్నాయని భోగట్టా. సమీరా రెడ్డి వయస్సు ప్రస్తుతం 45 సంవత్సరాలు కాగా ఆమె న్యాచురల్ లుక్ లో కనిపించడానికి ఆమె ఇష్టపడుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus