కొబ్బరిమట్ట అనే సినిమా విడుదలవుతున్నప్పుడు ఎవరు కనీసం ఈ సినిమా పెట్టిన డబ్బులు కూడా వస్తాయని అంచనా వేయలేదు. అలాంటిది ఈ స్పూఫ్ సినిమా జనాల్ని విశేషంగా ఆకట్టుకొంటూ మొదటి మూడు రోజుల్లోనే పెట్టిన మొత్తాన్ని కలెక్ట్ చేసి.. ఇప్పుడు లాభాల బాట పట్టింది. ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ప్రస్తుతం సెలబ్రేషన్స్ చేసుకొంటున్నారు. ఎప్పుడో మూడేళ్ళ క్రితం మొదలైన సినిమా కదా.. ఇన్నేళ్ల తర్వాత ఎవరు చూస్తారులే అని అంచనా వేసిన ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకొనేలా చేసిన సినిమా “కొబ్బరిమట్ట”.
నాలుగోవారంలో ఇస్మార్ట్ శంకర్” తర్వాత హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో థియేటర్లు కళకలలాడేలా చేసిన సినిమా “కొబ్బరిమట్ట” అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవర్సేస్ తప్ప అన్నీ ఏరియాల్లోను కొబ్బరిమట్ట మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. చాలా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం 10 కోట్ల రూపాయల షేర్ ను వాసులు చేయడం ఖాయం అని కూడా విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. మరి అది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.