Samuthirakani: ఉపవాసంతో పవన్ కళ్యాణ్ బ్రో సినిమా పూర్తి చేశారా?

ప్రముఖ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు సముద్రఖని దర్శకుడిగా కూడా అదే స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే. తమిళంలో నటించిన వినోదయం సీతం అనే సినిమాని తెలుగులో రీమేక్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు తెలుగులో బ్రో అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరంతేజ్ కూడా నటించారు. ఈ సినిమా జులై 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నేడు శిల్పకళా వేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించినటువంటి సముద్రఖని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఈ సినిమా గురించి అలాగే పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సినిమా కథ పవన్ కళ్యాణ్ గారికి చెప్పగానే ఆయన ఎప్పుడు స్టార్ట్ చేద్దామని అడిగారని తెలిపారు.

మీరు ఓకే అంటే రేపటి నుంచి సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తాను చెప్పాను అయితే మూడు రోజులలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని తెలియజేశారు. ఇక షూటింగ్ లొకేషన్లో పవన్ కళ్యాణ్ గారు సమయం వృధా చేయకుండా అక్కడే కాస్ట్యూమ్స్ మార్చుకొని షూటింగ్ పూర్తి చేశారని సముద్రఖని (Samuthirakani) వెల్లడించారు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక దేవుడి పాత్రలో నటిస్తున్నారు.

ఈ దేవుడి పాత్రలో నటించే సమయంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా ఉపవాసం ఉండి ఈ సినిమాలోని దేవుడి పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేశారని తెలిపారు. ఇలా ఉపవాసంతో సినిమా షూటింగ్ పూర్తి చేశారని విషయం తెలియడంతో పవన్ కళ్యాణ్ కు సినిమా పట్ల ఉన్నటువంటి డేడికేషన్ ఎంటో అర్థమవుతుంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus