Samyuktha Hegde: సముద్రపు మధ్య లో తన అందాలను చూపిస్తున్న సంయుక్త హెగ్డే !

సినిమా అవకాశాల కోసమో.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ కోసమో గ్లామరస్‌ ఫోటోలను పోస్ట్‌ చేయడానికి హద్దులు చెరిపేస్తున్నారు నేటి తరం తారామణులు. చివరికి బికినీల్లోనూ కనిపించడానికి కూడా ఆలోచించడం లేదు. రెండేళ్ల క్రితం పార్కులో జరిగిన గొడవతో సంయుక్త నేషనల్ వైడ్‌గా ఫేమస్ అయింది. పార్కులోనే లైవ్‌లో షర్ట్ విప్పేసి నానా హంగామా చేసింది. ఆమె దాదాపుగా ఎక్కువ టైం బికినీలో కనిపిస్తుంటుంది. అయితే ఆమెను సినిమాల కంటే కూడా కాంట్రవర్సీలు ఎక్కువగా ఫేమస్ చేశాయి.

తాజాగా నటి సంయుక్త హెగ్డే (Samyuktha Hegde) పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. ఈ శాండిల్‌ వుడ్‌ బ్యూటీ ఆ మధ్య బిగ్‌ బాస్‌ రియాల్టీ గేమ్‌ షోలో పాల్గొని హల్‌ చల్‌ చేసింది. కన్నడ, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో కనువిందు చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఆఫర్ల కోసం ఎదురుచూస్తోంది. గతంలో నటించిన చిత్రాలు చాలావరకు సక్సెస్‌ అయిన సంయుక్తకు మాత్రం పెద్దగా కలిసిరాలేదు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడంతో గ్లామర్‌ షోతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

సోషల్‌ మీడియా వేదికగా గ్లామరస్‌ ఫొటోలను ఇన్‌ స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే పనిలో పడింది. తాజాగా మరో అడుగుముందుకేసి ఏకంగా స్విమ్మింగ్ డ్రెస్‌లో ప్రత్యక్షమైంది. సముద్రంలో నీళ్లపై తేలియాడుతూ స్విమ్‌ చేస్తున్న ఓ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ‘సముద్రం చాలా లోతైనది, ప్రమాదకరమైనది. ఐతే ప్రతి ఒక్కరూ దానిలో మునిగిపోలేరు. కానీ అలా మునిగిపోని వారు సరికొత్త ప్రపంచాన్ని అన్వేషిస్తారు.

సరికొత్త జీవితాన్ని అనుభవిస్తారు! చివరికి దాని లోతు అర్ధమవుతుంది. దాని ప్రమాదం ఉత్సాహంగా మారుతుంది..’ అంటూ సముద్రంలో స్విమ్మింగ్‌ చేస్తున్న వీడియోకు క్యాప్షన్‌గా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సంయుక్త హెగ్డేను తెగ ట్రోల్‌ చేస్తున్నారు. అవకాశాల కోసం మరీ ఇంతగా దిగజారాలా అంటూ మండిపడుతున్నారు. మరి నటి సంయుక్త హెగ్డే ట్రిక్స్‌ ఎంతవరకు ఫలితానిస్తాయనేది వేచి చూడాల్సిందే.


రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus