కొరియేగ్రాఫర్ తో లవ్ ఎఫైర్ ను బయటపెట్టిన హీరోయిన్

సనా ఖాన్ అనే హీరోయిన్ పేరును ఇప్పుడు జనాలు మర్చిపోయారు కానీ.. “మిస్టర్ నూకయ్య” సినిమాలో ఆమె ఆరబోసిన అందాలు చూసి అప్పట్లో కుర్రాళ్ళందరూ సెగలు గక్కిన సందర్భాలు కోకొల్లలు. ఆమె కొన్నాళ్లపాటు తెలుగు, తమిళ భాషల్లో తన లక్ ను గట్టిగా చెక్ చేసుకున్నా తర్వాత వేరే ఆప్షన్ లేక బాలీవుడ్ కి వలస వెళ్లిపోయింది. అక్కడ సల్మాన్ ఖాన్ పంచన చేరి హిందీ బిగ్ బాస్ షోలో స్థానం సంపాదించుకొంది. ఆ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సనా ఖాన్ ఆ తర్వాత బాలీవుడ్ లో “వజా తుమ్ హో” అనే ఒక అడల్ట్ ఫిలిమ్ లో నటించి అందరి దృష్టి తనవైపుకు మళ్లించుకోవాలని ప్రయత్నించినప్పటికీ.. పెద్దగా ఫలితం దక్కలేదనుకోండి.

అయితే.. ఆమె మాత్రం సినిమాలతో సంబంధం లేకుండా ఎప్పుడు ఏదో ఒకరంగా వార్తల్లో నిలుస్తూ ఉండేది. అయితే.. గత కొంతకాలంగా ఆమె ఒక వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉందని వార్తలు వినిపిస్తుండగా.. ఎట్టకేలకు ఆ విషయమై తానే స్వయంగా అఫీషియల్ స్టేట్ మెంట్ ఇచ్చింది. బాలీవుడ్ లో మంచి కొరియోగ్రాఫర్ గా పేరు సంపాదించుకున్న మెల్విన్ లూయిస్ తో డేటింగ్ చేస్తున్నానని ప్రకటించింది. దాంతో సనా ఖాన్ విషయంలో నిన్నటివరకూ నెలకొన్న కన్ఫ్యూజన్ లో క్లారిటీ వచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus