Sandeep Kishan: ఊరు పేరు భైరవకోనకు సోలో డేట్.. ఆ మూడు సినిమాలు తప్పుకున్నాయా?

  • February 2, 2024 / 03:00 PM IST

మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ నటించిన ఈగల్ మూవీ ఫిబ్రవరి నెల 9వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సోలో రిలీజ్ డేట్ ఇస్తామని నిర్మాతలు హామీ ఇచ్చినా ఆ హామీ నిజం కాలేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పోటీగా యాత్ర2, లాల్ సలాం సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ నెల 7వ తేదీన కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమా కూడా రీ రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

అయితే అదే తేదీన రిలీజ్ కావాల్సిన ఊరు పేరు భైరవకోన సినిమా ఫిబ్రవరి 16వ తేదీన రిలీజవుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ను మార్చుకోవడానికి నిర్మాతల నుంచి సోలో రిలీజ్ డేట్ ఆఫర్ లభించిందని తెలుస్తోంది. అయితే నిర్మాతలు సైతం ఆ హామీని నిలబెట్టుకున్నారు. ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ కావాల్సిన గోపీచంద్ భీమా సినిమా మార్చి నెల 8వ తేదీకి వాయిదా పడింది. మహా శివరాత్రి పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ కావాల్సిన సుందరం మాస్టర్ సినిమా ఈ నెల 23వ తేదీన రిలీజ్ కానుంది. ఆపరేషన్ వాలంటైన్ రిలీజ్ డేట్ విషయంలో సైతం మార్పులు జరగగా కొత్త రిలీజ్ డేట్ గురించి స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమాలలో ఎన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తాయో చూడాల్సి ఉంది. సాధారణంగా ఫిబ్రవరి నెల తెలుగు సినిమాలకు అనుకూలం కాదు.

ఫిబ్రవరి మూడో వారం నుంచి ఏప్రిల్ చివరి వారం వరకు పరీక్షల సీజన్ కావడంతో ఈ సమయంలో సినిమాలను రిలీజ్ చేయడం రిస్క్ గా భావిస్తారు. అయితే కొన్ని సినిమాలు ఫిబ్రవరి సెంటిమెంట్ ను బ్రేక్ చేసి సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ నెలలో రిలీజ్ కానున్న మరికొన్ని సినిమాలు సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus