Sandeep Reddy Vanga: ఆ ఇద్దరిని డైరెక్ట్‌ చేయాలి… మనసులో మాట చెప్పిన సందీప్‌!

సౌత్‌ దర్శకులు బాలీవుడ్‌ వెళ్లి అక్కడ సినిమాలు చేయడం, అవి భారీ విజయం అందుకోవడం ఇటీవల చూస్తున్నాం. ఇటీవల కాలంలో అట్లీతో మొదలైన ఈ స్టైల్‌… సందీప్‌ రెడ్డి వంగాతో కంటిన్యూ అయ్యింది అని చెప్పాలి. షారుఖ్‌ ఖాన్‌ – అట్లీ కాంబినేషన్లో వచ్చిన ‘జవాన్‌’ బ్లాక్‌బస్టర్‌ కాగా… ఆ స్ట్రీక్‌ను రణ్‌బీర్‌ కపూర్‌ – సందీప్‌ రెడ్డి వంగా ‘యానిమల్‌’ సినిమాతో కంటిన్యూ చేశారు. ఇప్పుడు ‘యానిమల్‌ పార్క్‌’ అని సీక్వెల్‌ చేస్తామని ప్రకటించారు కూడా.

అయితే ఇక్కడ విషయం ఏంటంటే… ఈ సినిమా తర్వాత అయినా సందీప్‌ తిరిగి టాలీవుడ్‌ వచ్చేస్తారా? అదేంటి ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ తెలుగు సినిమానే కదా అంటారా? అస్సలు కాదు. ఎందుకంటే ఆ సినిమాను హిందీ ప్రధానంగా అక్కడి నిర్మాతే చేస్తున్నారు. కాబట్టి అది హిందీలో రూపొందుతున్న తెలుగు సినిమా అని చెప్పొచ్చు. అంటే ‘ఆదిపురుష్‌’లా అన్నమాట. అయితే ఇప్పుడు సందీప్‌ తిరిగి రాకపోవడం ఏంటి అనే డౌట్‌ వస్తోందా?

బాలీవుడ్‌లో మీరు ఎవరితో సినిమాలు చేయాలని అనుకుంటున్నారు అని సందీప్‌ రెడ్డి వంగాను అడిగితే.. అగ్ర కథానాయకుడు షారుఖ్‌ ఖాన్‌తో కలసి పని చేయాలని ఉందని చెప్పారు. అలాగే రణ్‌వీర్‌ సింగ్‌తోనూ సినిమా చేయాలని ఉందని సందీప్‌ అన్నారు. ‘యానిమల్‌’ అందుకున్న విజయం, రణ్‌బీర్‌కు వచ్చిన అప్లాజ్‌ చూశాక స్టార్‌ హీరోలు సందీప్‌ రెడ్డి వంగాతో సినిమా చేయడాని ఈజీగా రెడీ అవుతారు అని చెప్పాలి.

అదే జరిగితే ఇప్పట్లో సందీప్‌ (Sandeep Reddy Vanga) తిరిగి తెలుగులోకి వచ్చే పరిస్థితి లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఒక్కో సినిమాకు కనీసం ఆయన ఏడాది, ఏడాదిన్నర తీసుకుంటూ ఉంటారు. ఆ లెక్కన ‘స్పిరిట్‌’, ‘యానిమల్‌ పార్క్‌’కే మూడేళ్లు పడుతుంది. ఆ తర్వాత ఇద్దరు స్టార్‌ హీరోల సినిమాలు అంటే మరో మూడేళ్లు వేసుకోవచ్చు. అలా మొత్తంగా మరో ఆరేళ్ల వరకు సందీప్‌ తిరిగి తెలుగులోకి రాకపోవచ్చు. మరి మహేష్‌బాబు, చిరంజీవితో సినిమాలు అన్నారు అవెప్పుడో చూడాలి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus