అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగ, ఇప్పుడు ప్రభాస్‌తో ‘స్పిరిట్’ తీస్తున్నాడు. ఈ సినిమా ఆడియో గ్లింప్స్‌లో ప్రభాస్ పేరు ముందు వాడిన “ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్” అనే ట్యాగ్, ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఫ్యాన్స్ పండగ చేసుకుంటుండగా, ఇండస్ట్రీ వర్గాలు దీన్ని లోతుగా విశ్లేషిస్తున్నాయి.
నెటిజన్లు కూడా దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. “సందీప్ తన గత హీరోలు విజయ్ దేవరకొండకు గానీ, ‘యానిమల్’తో 900 కోట్లు కొట్టిన రణ్‌బీర్ కపూర్‌కు గానీ ఇలాంటి బిరుదు ఎప్పుడూ ఇవ్వలేదు. మరి ప్రభాస్‌కే ఎందుకిచ్చాడు?” అనేది వారి మెయిన్ పాయింట్. ఇది కేవలం ఫ్యాన్స్ కోసం వేసిన ఎలివేషన్ కాదని, దీని వెనుక పక్కా లెక్కలున్నాయని వారు కామెంట్ చేస్తున్నారు.
చాలా మంది నెటిజన్లు దీనిని ఒక ‘ప్యూర్ బిజినెస్ స్ట్రాటజీ’గా చూస్తున్నారు. ఇది ఇతర హీరోలను తక్కువ చేయడం కాదని, తన సినిమా స్థాయిని మార్కెట్‌కు తెలియజేసే ప్రయత్నమని అంటున్నారు. “సందీప్ ‘యానిమల్’తో బాలీవుడ్ మార్కెట్‌ను ఏలాడు. ఇప్పుడు ‘స్పిరిట్’ కోసం అంతకుమించిన బడ్జెట్, బిజినెస్ ప్లాన్ చేస్తున్నాడు.
దానికి తగ్గట్టుగా, తన హీరో ‘ఇండియాలోనే బిగ్గెస్ట్’ అని ప్రకటించడం ద్వారా, ఈ సినిమా పాన్ఇండియా మార్కెట్‌లో ఒక కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయబోతోందని బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు సందీప్ ఒక బలమైన సందేశం ఇస్తున్నాడు” అని అభిప్రాయపడుతున్నారు.
ఈ ట్యాగ్‌కు ప్రభాస్ అర్హుడేనని ఫ్యాన్స్ లెక్కలతో సహా చెబుతున్నారు. “గత పదేళ్లలో ‘బాహుబలి‘ సిరీస్, ‘సాహో‘, ‘సలార్‘, ‘కల్కి‘.. ఇలా ఫ్లాపులతో కలిపి కూడా ప్రభాస్ సినిమాలు క్రియేట్ చేసిన మార్కెట్ విలువ సుమారు 5 వేల కోట్లు. ఇండియాలో ఏ హీరోకి ఈ రేంజ్ బిజినెస్ లేదు. కాబట్టి సందీప్ పెట్టిన ట్యాగ్‌లో తప్పేలేదు” అని గట్టిగా వాదిస్తున్నారు. మొత్తం మీద, ‘స్పిరిట్‘ ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే, సందీప్ వంగ ఈ ఒక్క ట్యాగ్‌తో సినిమాపై అంచనాలను, బిజినెస్ లెక్కలను ఎక్కడికో తీసుకెళ్లాడు.