మహేష్ బాబుతో సినిమా గురించి సందీప్ రెడ్డి క్లారిటీ

“అర్జున్ రెడ్డి” విడుదలై సంచలన విజయం సొంతం చేసుకొన్నప్పుడు.. ఆ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తదుపరి సినిమా అంటూ పలు ప్రోజెక్ట్స్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అందులో మహేష్ బాబు హీరోగా ప్లాన్ చేసిన సినిమా ఒకటి. ఆ సినిమాకి “షుగర్ ఫ్యాక్టరీ” అనే వర్కింగ్ టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఆ సినిమా ఎప్పుడు సెట్స్ కు వెళ్తుంది అనే విషయంలో ఇప్పటివరకూ క్లారిటీ లేకుండాపోయింది. అయితే.. నిన్నమొన్నటివరకూ కథానాయకుడు మహేష్ బాబు కానీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కానీ రెస్పాండ్ అవ్వకపోవడంతో ఈ ప్రొజెక్ట్ కూడా రూమర్స్ వరకే పరిమితం అనుకున్నారు అందరూ.

కట్ చేస్తే.. ప్రస్తుతం “అర్జున్ రెడ్డి” చిత్రాన్ని బాలీవుడ్ లో “కబీర్ సింగ్” పేరుతో రీమేక్ చేసి జూన్ 21న ఆ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. ఈ సందర్భంగా బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన సందీప్ రెడ్డి వంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన ప్రొజెక్ట్ గురించి మాట్లాడుతూ.. “మహేష్ బాబుకి ఒక లైన్ చెప్పాను. అది ఆయనకి నచ్చింది. డెవలప్ చేసి ఫుల్ మూవీ స్టోరీ ప్రిపేర్ చేయమన్నారు. పూర్తవ్వగానే ఆయనకి కథ చెప్తాను” అని క్లారిటీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. మరి కథ ఎప్పుడు ఒకే అవుతుంది? ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ సినిమా ఎప్పుడు సెట్స్ కు వెళ్తుంది అని మహేష్ అభిమానులతోపాటు తెలుగు సినిమా ప్రేక్షకులందరూ గట్టిగా వెయిట్ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus