Sangeetha: ఖడ్గం మూవీ సమయంలో సంగీత అలా ఫీల్ అయ్యారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడంతో పాటు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న నటీమణులలో సంగీత ఒకరు. సెకండ్ ఇన్నింగ్స్ లో దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమాలలో సంగీత ఎక్కువగా నటించారు. ఈ ఏడాది వారసుడు సినిమాతో సంగీత ఖాతాలో మరో సక్సెస్ చేరిందనే సంగతి తెలిసిందే. ఒక ఇంటర్వ్యూలో సంగీత మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. సంగీత మాట్లాడుతూ నాకు నిద్రపోవడం అంటే ఇష్టమని నన్ను వదిలేస్తే 24 గంటలు కూడా నిద్రపోతానని కామెంట్ చేశారు.

నేను కళ్లు మూసుకుంటే వెంటనే కలలు వస్తాయని ఆమె చెప్పుకొచ్చారు. నాకు వచ్చిన కలలను చెప్పిన వెంటనే మరిచిపోతానని సంగీత కామెంట్ చేశారు. నేను డీసెంట్ అని నా వంటలను నేను వండుకుంటానని ఆమె వెల్లడించారు. నా భర్త వెజిటేరియన్ అని అందువల్ల వెజ్ వంటకాలను ఎక్కువగా వండుతానని సంగీత పేర్కొన్నారు. చపాతి, వెజిటేరియన్ గ్రేవీ, సాంబర్, రసం ఎక్కువగా చేస్తానని ఆమె కామెంట్లు చేశారు. నా ఇల్లు నాకు బెస్ట్ హాలిడే స్పాట్ అని ఆమె తెలిపారు.

పెళ్లికి ముందు సంగీతకు పెళ్లి తర్వాత సంగీతకు తేడా ఏంటనే ప్రశ్నకు సంగీత స్పందిస్తూ నాకు నా భర్త ఎలాంటి షరతులు పెట్టలేదని సంగీత అన్నారు. ఖడ్గం సినిమా షూట్ సమయంలో నాకు మైనస్ అయ్యేలా మేకప్ వేశారని ఆమె చెప్పుకొచ్చారు. మేకప్ లో నన్ను నేను చూసుకుని ఇబ్బందికరంగా ఫీలయ్యానని సంగీత కామెంట్లు చేశారు. అన్నపూర్ణ స్టూడియో బయట ఆ సీన్ షూట్ జరిగిందని నేను రాను అని చెప్పానని ఆమె వెల్లడించారు.

యూనిట్ పీపుల్ అంతా బాగుంది అని అంటుండగా షూట్ చూస్తున్న పబ్లిక్ మాత్రం కృష్ణవంశీకి పిచ్చి పట్టిందా ఈ అమ్మాయి హీరోయిన్ ఏంటి అన్నారని సంగీత చెప్పుకొచ్చారు. ఖడ్గం రిలీజ్ తర్వాత నాకు మంచి పేరు వచ్చిందని ఆమె తెలిపారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus