భన్సాలీ నెక్స్ట్ సినిమా అదే..!!
- May 11, 2016 / 09:53 AM ISTByFilmy Focus
“బాజీరావ్ మస్తానీ” సినిమాతో ప్రాంతీయ, జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి అవార్డులు దక్కించుకొన్న సంజయ్ లీలా భన్సాలీ తన తదుపరి చిత్రంగా యాక్షన్ సినిమా తీస్తున్నాడని, కాదు కాదు థ్రిల్లర్ సినిమా తీస్తున్నాడని రకరకాల వార్తలు వినవచ్చాయి.
అయితే.. వాటిలో ఏమాత్రం నిజం లేదు. భన్సాలీ తన తదుపరి చిత్రంగా మళ్లీ హిస్టారికల్ సినిమానే తీయనున్నాడని తెలుస్తోంది. సుల్తాన్ అల్లాఉద్దీన్ అనే ఓ మహారాజు.. రాణి పద్మావతితో ప్రేమలో పడి ఏవిధంగా నాశనం అయిపోయాడు? అనే చారిత్రిక కథాంశాన్ని తీసుకొని.. “పద్మావతి” అనే సినిమా ప్లాన్ చేస్తున్నాడట భన్సాలీ. ఈ విషయాన్ని ఆయన డైరెక్షన్ డిపార్ట్ మెంట్ టీమ్ కన్ఫర్మ్ చేసింది!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












