బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సొంతం చేసుకొన్న కత్తి రీమేక్ రైట్స్

ఒక భాషలో ఘన విజయం సొంతం చేసుకొన్న చిత్రాలను వేరే భాషల్లో రీమేక్ చేయడం అనేది కొత్తేమీ కాదు. “అత్తారింటికి దారేది” చిత్రం ఇప్పటికే మూడు భాషల్లో రీమేక్ అవ్వగా తాజాగా తమిళంలో తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు అదే తరహాలో తమిళంలో ఘన విజయం సాధించిన “కత్తి” చిత్రాన్ని కూడా బహు భాషల్లో రీమేక్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆల్రెడీ తెలుగులో చిరంజీవి రీఎంట్రీ కోసం ఈ చిత్ర కథను వాడారు. ఇప్పుడు హిందీలో ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు రంగం సిద్ధమైంది.

నిజానికి తెలుగులో తెరకెక్కడానికంటే ముందు హిందీలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకొన్నారు. కానీ.. అనుకొన్న ప్రకారం ప్రీప్రొడక్షన్ వర్క్ సాగకపోవడంతో ఏడాది క్రితం ఆపేశారు. అయితే.. తాజా సమాచారం ప్రకారం “కత్తి” హిందీ రీమేక్ రైట్స్ ను బాలీవుడ్ అగ్ర దర్శకుడైన సంజయ్ లీలా భన్సాలీ సొంతం చేసుకొన్నారని తెలుస్తోంది. ఆయన “కత్తి” హిందీ వెర్షన్ ను డైరెక్ట్ చేస్తాడా లేక ప్రొడ్యూస్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉండగా.. ఈ హిందీ రీమేక్ లో అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవగణ్ హీరోగా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మురుగదాస్ మునుపటి చిత్రాలైన “గజిని, తుపాకీ” చిత్రాలు కూడా బాలీవుడ్ లో రీమేక్ అయిన విషయం తెలిసిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus