సంక్రాంతి కి నవ్వించే బాధ్యత వెన్నెల కిషోర్ తీసుకున్నాడు

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ కమెడియన్ ఎవరంటే తడుము కోకుండా చెప్పొయొచ్చు అది వెన్నెల కిషోర్ అని. విలక్షణమైన నటన మరియు డైలాగ్ డెలివరీ ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే తత్త్వం వెన్నెల కిషోర్ ని మోస్ట్ వాంటెడ్ కమెడియన్ గా మార్చింది. టాలీవుడ్ లో ప్రత్యామ్నాయం లేని కమెడియన్ గా వెన్నెల కిషోర్ మారిపోయారు. ఆరోగ్య కారణాల రీత్యా బ్రహ్మానందం విరివిగా సినిమాలు చేయడంలేదు. ఇక సునీల్ హీరోగా మారి కమెడియన్ అనే మార్క్ పోగొట్టుకున్నారు. వీళ్లిద్దరి తరువాత ఒక స్థాయి కమెడియన్ గా మారిన సప్తగిరి లాంటి వాళ్ళు కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన పూర్తి స్థాయి కమెడియన్ హోదా కోల్పోయారు. దీనితో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కమెడియన్ గా వెన్నెల కిషోర్ ఎదిగారు.

ఈ మధ్య కాలంలో ఆయన లేని సినిమా కనిపించడం లేదు. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా ప్రతి సినిమాలో ఆయన కనిపిస్తున్నారు. కాగా టాలీవుడ్ లో తెరకెక్కిన సంక్రాంతి చిత్రాలైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో మరియు ఎంత మంచివాడవురా చిత్రాలలో కామన్ గా ఉన్న ఓకే ఒక్క కమెడియన్ వెన్నెల కిషోర్. ఈ మూడు సంక్రాంతి సినిమాలలో వెన్నెల కిషోర్ నటించారు. మూడు సినిమాలలో మూడు భిన్నమైన నేపథ్యంలో కూడిన కామెడీ, ఆయన పండించనున్నారు. ఒకప్పుడు బ్రహ్మానందం మాత్రమే ఇలా ప్రతి సినిమాలో కనిపించే వారు. అలాంటి స్టార్ కమెడియన్ హోదా ఇప్పుడు వెన్నెల కిషోర్ అనుభవిస్తున్నారు. వెన్నెల కిషోర్ హీరో అవతారం ఎత్తకుంటే ఆయన ఇలాగే లెక్కకు మించిన అవకాశాలతో దూసుకుపోవచ్చు. టాలీవుడ్ లో మరో కమెడియన్ సత్య ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం కలదు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus