ఈ మధ్య కాలంలో చాలా మంది మత్తుకి బానిసలై చేస్తున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. వీటి గురించి న్యూస్ ఛానల్స్ లో మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. చాలా మందికి మద్యం సేవించడం కామన్ అయిపోయిన ఈ రోజుల్లో.. కొంతమంది ఆ మత్తు కూడా సరిపోక మరింత ఎక్కువ డోస్ కోసం డ్రగ్స్ వంటివి వాడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్లే చాలా దారుణాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇలాంటి వాళ్ళ వల్ల హీరోయిన్లకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నట్టు స్పష్టమవుతుంది.
షూటింగ్ టైంలో ఓ హీరో కూడా డ్రగ్స్ కొట్టి..హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించాడట. వివరాల్లోకి వెళితే.. మలయాళ నటి విన్సీ సోనీ (Vincy Sony) అలోషియస్ చేదు అనుభవం ఎదురైంది. అయితే అది ఇప్పుడు కాదు లెండి. గతంలో ఆమె ఫేస్ చేసిన ఓ సంఘటనను ఆమె సోషల్ మీడియా ముఖంగా గుర్తుచేసుకుంది.ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశం అయ్యాయి. గతంలో ఆమె ఓ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న టైంలో… ఒక అగ్ర హీరో డ్రగ్స్ కొట్టి ఆ మత్తులో విన్సీ వద్దకు వచ్చాడట.
సెట్స్ లో అందరూ చూస్తుండగానే ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడట. తర్వాత సెట్స్ లో ఉన్న దర్శకనిర్మాతలు వాళ్ళ అసిస్టెంట్లు వచ్చి… అతన్ని వెనక్కి లాగడంతో బయటపడినట్టు ఆమె తెలిపింది. ఆ సంఘటన ఆమెను భయాందోళనకు గురి చేసినట్లు కూడా చెప్పుకొచ్చింది. ఇటీవల విన్సీ మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన క్యాంపెయిన్ కి హాజరైంది. ఈ క్రమంలో డ్రగ్స్ అలవాటు ఉన్న నటులతో ఆమె (Vincy Sony) నటించనని కూడా అందులో భాగంగా తెలిపినట్టు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.