ప్రముఖ కథానాయకుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh Babu) వీరాభిమాని అనే విషయం తెలిసిందే. ఆయనతో రెండు సినిమాలు నిర్మించిన విషయమూ తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా అదే అభిమానాన్ని చూపిస్తూ వస్తున్న ఆయన.. తాజాగా చేసిన ఓ సోషల్ మీడియా పోస్టు పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. అలా అని ఆయన ఏదో అన్నారని కాదు.. జస్ట్ థ్యాంక్యూ అని చెప్పారంతే. అయితే దాంతోపాటు ఓ సినిమా పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఆ సినిమానే ఇప్పుడు చర్చకు కారణమైంది అని చెప్పాలి.
బండ్ల గణేశ్‌ను నిశితంగా ఫాలో అవుతున్న వాళ్లకు ఆయన ఏం సినిమా పోస్టర్ పోస్ట్ చేశారో మీకు తెలిసే ఉంటుంది. ఆయన పెట్టిన ఫొటో ‘తీన్ మార్’ (Teen Maar) సినిమా గురించి. అవును ఆ సినిమాలోకి రెండు పాత్రలను తెలిపేలా రూపొందించిన ఓ పాత పోస్టర్‌ను బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతోపాటు థ్యాంక్యూ అని మాత్రం రాసుకొచ్చారు. దీంతో బండ్ల గణేశ్ ఎందుకు థాంక్స్ చెప్పినట్టు అనే చర్చ మొదలైంది.
థ్యాంక్యూ సందర్భం ఏంటి అని కొందరు తలలు పట్టుకుంటుడగా.. మరికొందరేమో ఆ సినిమాను రీరిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని, దానికి పవన్ కల్యాణ్ ఓకే చెప్పడం వల్లే ఆ పోస్టు పెట్టారు అని అనుకుంటున్నారు. ఆ పోస్టుకు చాలా మంది రిప్లైలు ఇస్తున్నా బండ్ల గణేశ్ ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అయితే ‘మంచి సినిమా ఇచ్చారు.. మేమే సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయాం’ అనే కామెంట్‌ను మాత్రం బండ్ల గణేశ్ రీపోస్టు చేయడం గమనార్హం.
ఇక ఈ సినిమా గురించి చూస్తే పవన్ కల్యాణ్, త్రిష (Trisha), కృతి కర్బంధ (Kriti Kharbanda) ప్రధాన పాత్రల్లో నటించారు. జయంత్‌సీ పరాన్జీ (Jayanth C. Paranjee) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు రాశారు. ఏప్రిల్ 14, 2011లో వచ్చిన ఈ సినిమాకు ఇప్పటికి 14 ఏళ్లు. ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్ ఈ పోస్టు చేశారు అని సమాచారం.