కార్తి హీరోగా ‘అభిమన్యుడు’ ఫేమ్ పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సర్దార్’.ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది. రాశి ఖన్నా , రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో కింగ్ అక్కినేని నాగార్జున తన ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ద్వారా విడుదల చేశారు.
మొదటి రోజు ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.సినిమా చూసిన ప్రతి ఒక్కరూ టాక్ బాగానే చెప్పారు. దీంతో మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టింది.మొదటి రోజును మించి రెండో రోజు, రెండో రోజుని మించి మూడో రోజు కలెక్ట్ చేయడం విశేషం.ఇక 5వ రోజు కూడా ఈ మూవీ బాగానే కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుంది.ఒకసారి ‘సర్దార్’ 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 2.29 cr |
సీడెడ్ | 0.70 cr |
ఉత్తరాంధ్ర | 0.77 cr |
ఈస్ట్+వెస్ట్ | 0.48 cr |
కృష్ణా + గుంటూరు | 0.65 cr |
నెల్లూరు | 0.28 cr |
ఏపి+ తెలంగాణ | 5.17 cr |
‘సర్దార్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.59 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.5.17 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది.
బయ్యర్స్ కు ఈ మూవీ రూ.0.27 కోట్ల లాభాలను అందించింది. ‘కాంతార’ ఎఫెక్ట్ లేకపోతే ఈ మూవీ ఇంకా బాగా కలెక్ట్ చేసుండేది. అయినప్పటికీ పోటీలో కూడా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించడం అంటే మామూలు విషయం కాదు.
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!