Sardar OTT: ఆహాలో ప్రసారం కానున్న సర్దార్.. ఎప్పుడంటే?

కోలీవుడ్ హీరోలలో ఒకరైన కార్తీకి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. యుగానికి ఒక్కడు, ఆవారా, ఊపిరి వంటి సినిమాలలో నటించిన ఈయనకు తెలుగులో కూడా మంచి ఆదరణ లభించడంతో ఈయన సినిమాలు తెలుగులో కూడా మంచి హిట్ అందుకుంటున్నాయి. ఇకపోతే తాజాగా కార్తీక్ నటించిన చిత్రం సర్దార్. దర్శకుడు పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్దార్ సినిమాలో కార్తీ ద్విపాత్రాభినయంలో సందడి చేశారు. ఇలా సర్దార్ సినిమా ద్వారా తండ్రి కొడుకుల పాత్రలలో నటించి ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు.

ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. అక్టోబర్ 21వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా తెలుగులో కూడా మంచి వసూలు రాబట్టింది. ఇక ఈ సినిమాలో కార్తీక్ సరసన రాశీఖ‌న్నా, ర‌జిష విజ‌య‌న్‌, లైలా నటించారు. ఇలా అక్టోబర్ 21వ తేదీ థియేటర్లలో విడుదలైనటువంటి ఈ సినిమాని అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ రైట్స్ తెలుగులో ఆహా కైవసం చేసుకున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఆహా అధికారకంగా ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని కూడా విడుదల చేశారు. అక్టోబర్ 21వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమాని నవంబర్ 18 వ తేదీ ప్రసారం చేయనున్నట్లు ఆహా వెల్లడించింది.కార్తీ ఆరు విభిన్న గెటప్స్, బ్రిలియంట్ ఫెర్ ఫార్మెన్స్, వైవిధ్యమైన కథ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. థియేటర్లో ప్రేక్షకులను ఎంతగానో సందడి చేసిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus