ఆ విషయంలో మహేష్,బన్నీ సినిమాలు సేఫ్..!

  • November 11, 2019 / 04:17 PM IST

‘బాహుబలి’ (ది బిగినింగ్), ‘శ్రీమంతుడు’ వంటి సినిమాలతో.. ఓవర్సీస్ లో తెలుగు సినిమా అంటే అక్కడి జనాలకి మంచి నమ్మకం ఏర్పడింది. అలా ‘బాహుబలి2’ ‘రంగస్థలం’ ‘భరత్ అనే నేను’ చిత్రాల వరకూ ఆ హవా సాగింది. కానీ కంటెంట్ చూడకుండా గుడ్డి నమ్మకంతో కొందరు డిస్ట్రిబ్యూటర్లు సినిమాలు పంపిణి చేయడం వల్ల అనుకుంట.. ఈసారి మాత్రం పెద్ద దెబ్బే తగిలిందని చెప్పాలి. 2018లో ‘రంగస్థలం’ ‘భరత్ అనే నేను’ సినిమాలు 3 మిలియన్ పైనే కలెక్ట్ చేయడంతో బయ్యర్స్ లాభాల బాట పట్టారు.

కానీ 2019 నుండీ మాత్రం పరిస్థితి మారిపోయింది. ఈఏడాది ఒక్క సినిమా కూడా 3 మిలియన్ డాలర్ల వర్షం కురిపించలేకపోయింది. పాన్ ఇండియా రేంజ్ సినిమాలు అంటూ ‘సైరా’ ‘సాహో’ వంటి సినిమాల్ని ప్రోమోట్ చేసి విడుదల చేసినా… అవి 3 మిలియన్ కొట్టలేదు. పైగా బయ్యర్స్ కు కూడా నష్టాల్నే మిగిల్చాయి. దీంతో ఇప్పుడు తెలుగు సినిమాకి అక్కడ ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగడం లేదు అన్నది ఇన్ సైడ్ టాక్. మహేష్ బాబు.. అనిల్ రావిపూడి కాంబినేషన్ కాబట్టి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి మంచి బిజినెస్ జరిగింది. ‘ఎఫ్2’ కూడా 2 మిలియన్ కలెక్ట్ చేయడంతో ప్లస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. ఇక త్రివిక్రమ్ సినిమాలకి ఓవర్సీస్ లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ‘అల వైకుంఠపురములో’ సినిమాకి కూడా మంచి బిజినెస్ జరిగిందట. త్రివిక్రమ్ గత చిత్రం ‘అరవింద సమేత’ కూడా అక్కడ 2 మిలియన్ కొట్టడం .. ‘అల వైకుంఠపురములో’ సినిమాకి ప్లస్ అయ్యింది. ఇక 2020 లో విడుదల కాబోతున్న చాలా సినిమాలకి.. మంచి బిజినెస్ జరిగే అవకాశం అయితే కనిపించడం లేదట.

తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus