నాని (Nani) – వివేక్ ఆత్రేయ (Vivek Athreya) కాంబినేషన్లో ‘అంటే సుందరానికీ!’ (Ante Sundaraniki) తర్వాత రూపొందిన చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) . డీవీవీ దానయ్య (D. V. V. Danayya) నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందింది. ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య (SJ Suryah) పవర్ఫుల్ విలన్ గా నటించాడు. టీజర్, ట్రైలర్స్.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఆగస్టు 29న రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది.
దీంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి.వర్షాల వల్ల అనుకున్న రేంజ్లో కాకపోయినా.. మొత్తంగా చాలా బెటర్ అనిపించాయి అని చెప్పాలి.ఇక మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది. ఒకసారి (Saripodhaa Sanivaaram Collections) 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 9.65 cr |
సీడెడ్ | 2.87 cr |
ఉత్తరాంధ్ర | 2.62 cr |
ఈస్ట్ | 1.10 cr |
వెస్ట్ | 0.87 cr |
గుంటూరు | 1.23 cr |
కృష్ణా | 1.27 cr |
నెల్లూరు | 0.80 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 20.41 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.90 Cr |
ఓవర్సీస్ | 9.80 Cr |
మిగిలిన భాషలు | 0.82 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 33.93 cr |
‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram Collections) చిత్రానికి రూ.44.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.45 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజుల్లో ఈ సినిమా రూ.33.93 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.11.07 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.