ఆ విషయంలో సర్కారు మేకర్స్ తప్పు చేస్తున్నారా?

పరశురామ్ డైరెక్షన్ లో మహేష్, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట ఈ నెల 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా విడుదల చేసే అవకాశం ఉన్నా మేకర్స్ మాత్రం ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయడానికి ఇష్టపడటం లేదు. తాజాగా దర్శకుడు పరశురామ్ స్పందిస్తూ ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ఎందుకు విడుదల చేయడం లేదో వెల్లడించారు.

టాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని తాను సర్కారు వారి పాట మూవీ స్క్రిప్ట్ ను రాశానని సినిమాలో హీరో రోల్ కు ఎమోషనల్ థ్రెడ్ ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమాను లోకల్ గా కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించామని పాన్ ఇండియా ఎలిమెంట్స్ ను ఈ సినిమాలో యాడ్ చేయడం వల్ల స్క్రిప్ట్ డైల్యూట్ అవుతుందని ఆయన కామెంట్లు చేశారు. సర్కారు వారి పాట విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే ఇతర భాషల్లోకి ఈ సినిమా డబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.

మహేష్ బాబుకు బాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. డబ్బింగ్ సినిమాల ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు పాపులారిటీని సంపాదించుకున్నారు. సర్కారు వారి పాట సినిమా విషయంలో ఆ సినిమా మేకర్స్ తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయమో కాదో చూడాల్సి ఉంది. దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ సినిమాలో హీరోయిన్ రోల్ కు, సముద్రఖని పాత్రకు మంచి పేరు దక్కుతుందని చెప్పుకొచ్చారు. త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్ స్పూర్తి వల్లే డైలాగ్స్ బాగా రాయగలుగుతున్నానని ఆయన కామెంట్లు చేశారు.

సర్కారు వారి పాట సినిమాలో సితార చేసిన పెన్నీ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. సర్కారు వారి పాట తర్వాత నాగచైతన్యతో ఒక సినిమా తీస్తానని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus