Mahesh Babu, Keerthy Suresh: సర్కారు వెడ్డింగ్ సీన్ అలా ఉండబోతుందా?

మహేష్ కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన మురారి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు మహేష్ కెరీర్ లోని బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న మహేష్ బాబు పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. మహేష్ తో తొలిసారి కీర్తి సురేష్ నటిస్తుండగా ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. అయితే సినిమాలో మహేష్, కీర్తి సురేష్ కాంబినేషన్ లో వచ్చే వెడ్డింగ్ సీన్ సినిమాకు హైలెట్ అవుతుందని భారీగా సెట్స్ వేసి ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారని సమాచారం.

మురారి సినిమాలో పెళ్లి పాట ఏ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సర్కారు వారి పాట వెడ్డింగ్ సీన్ కూడా అదే విధంగా ఉండబోతుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన సర్కారు వారి పాట రిలీజ్ కానుంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ఈ సినిమాలోని పాటల విషయంలో థమన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సినిమాలోని పాటలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని సమాచారం.

మహేష్ హీరోగా తెరకెక్కి సంక్రాంతికి విడుదలైన సినిమాలలో ఎక్కువ సినిమాలు విజయం సాధించాయి. సర్కారు వారి పాట కూడా మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని మహేష్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. త్వరలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus