అప్పుడే 35కోట్లా..షూటింగ్ మొదలవ్వకుండానే మహేష్ సినిమా రికార్డులు మొదలు..!

  • September 15, 2020 / 10:01 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. తరువాత చిత్రాన్ని ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్(బుజ్జి) డైరెక్షన్లో చెయ్యడానికి కూడా రెడీ అయిపోయాడు. ‘సర్కారు వారి పాట’ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ ’14 రీల్స్ ప్లస్’ ‘జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. నవంబర్ నుండీ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను అమెరికా లో మొదలుపెట్టనున్నారు.

అక్కడ 45రోజుల పాటు మొదటి షెడ్యూల్ జరుగుతుందట.బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కూడా ఈ చిత్రంలో విలన్ గా నటిస్తాడని ప్రచారం జరుగుతుంది. హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపికయ్యింది. ఇదిలా ఉండగా.. ఇంకా ఈ చిత్రం షూటింగ్ మొదలుకాకుండానే అప్పుడే ఓ అరుదైన రికార్డుని సృష్టించిందట. వివరాల్లోకి వెళితే.. ‘సర్కారు వారి పాట’ నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ అప్పుడే పూర్తయిపోయిందట. ఈ చిత్రం డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ ను 35కోట్లను అమ్మేశారట నిర్మాతలు.

ఇంకా హిందీ శాటిలైట్ రైట్స్ మరియు డిజిటల్ రైట్స్ బిజినెస్ ఇంకా పూర్తికాలేదట. అవి కూడా కలుపుకుంటే.. 50 కోట్ల పైనే వచ్చే అవకాశం ఉందట. ఏమైనా షూటింగ్ మొదలుకాకుండానే 35కోట్ల పైనే బిజినెస్ జరగడం.. మహేష్ బాబు సినిమాలకు ఉన్న క్రేజ్ ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు.

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus