Mahesh Babu: ‘సర్కారు వారి పాట’ టీజర్‌ ప్రీ రిలీజ్‌ వెనుక ఇంత జరిగిందా!

Advertisement

9వ తేదీ ఉదయం 9:09… అంటూ ‘సర్కారు వారి పాట’ టీజర్‌ అదేనండి బ్లాస్టర్‌ రిలీజ్‌ డేట్‌ అండ్‌ టైమ్‌ అనౌన్స్‌ చేసింది మైత్రీ మూవీ మేకర్స్‌ బృందం. దీంతో అదరగొట్టేద్దాం అనుకొని ఫ్యాన్స్‌ అలా కునుకేశారో లేదో… రాత్రి 12.34 సమయంలో విడుదల చేసేశారు. దీంతో ఉదయాన్నే లేచి చూసినవాళ్లకు ఆశ్చర్యం, ఆనందం ఒకేసారి కలిగాయి. అయితే చెప్పిన టైమ్‌కి ముందుగా ఎందుకు రిలీజ్‌ చేశారు అనేదే ఇక్కడ ప్రశ్న.

దీనికి రెండు రకాల సమాధానాలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి లీకేజీ. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో టీజర్‌ లీకైందంట. కొన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో టీజర్‌ అప్పటికే కనిపించేయడంతో నిర్మాతలు వెంటనే తేరుకొని 12.34 సమయంలో రిలీజ్ చేసేశారట. అంతేకాదు లీక్‌ విషయంలో సైబర్‌ పోలీసులకు కంప్లైంట్‌ కూడా చేశారట. ఇది ఇంటి దొంగల పనా, లీకు వీరుల పనా అనేది తేలాల్సి ఉంది. ఇక మరో రకం టాక్‌ కూడా వినిపిస్తోంది.

టీజర్‌ను చెప్పిన సమయం కంటే ముందుగా రిలీజ్‌ చేయడం స్ట్రాటజీలో పని అని, అభిమానులకు స్పెషల్‌గా ఉండేందుకు చేశారని అంటున్నారు. అయితే ఇది ఏమంత ఇంట్రస్టింగ్‌గా, నమ్మేలా అనిపించడం లేదు. మరోవైపు పొరపాటున రాత్రి పబ్లిష్‌ చేసేసుంటారనే వాదనలూ వినిపిస్తున్నాయి. దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇస్తే బాగుండు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus