Sarkaru Vaari Paata Trailer: సర్కారు వారి పాట లీకులు ఆగడం లేదుగా..!

Ad not loaded.

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట ట్రైలర్ మే 2 న విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. కానీ ట్రైలర్ ముందుగానే నెట్టింట్లో లీక్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి ప్రధాన సర్కారు వారి పాట కి సంబంధించి ఓ చిన్న వీడియో బిట్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతుండడం వలనే .! మహేష్ బాబు ఓ తాళాల గుత్తి చేత్తో పట్టుకుని ప్రత్యర్ధులను చితకబాది రిలాక్స్ అవుతూ ఆ తాళాల గుత్తిని ఆడిస్తాడు.

అప్పుడు విలన్ గ్యాంగ్ బయపడుతున్నట్టు ఈ వీడియో బిట్ ఉంది. ట్రైలర్ చివర్లో వచ్చే విజువల్ ఇదని అంతా అభిప్రాయపడుతున్నారు. సర్కారు వారి పాట టీమ్ ను అడిగితే అసలు ఇది ట్రైలర్ లో విజువల్ కాదు అని చెబుతున్నారు.అప్పుడు సినిమాలో క్లిప్ లీక్ అయ్యిందా అంటూ మళ్ళీ డిస్కషన్స్ మొదలయ్యాయి. ఈ విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే మొదటి నుండీ సర్కారు వారి పాట కి సంబంధించి లీక్ లు అనేవి జరుగుతూనే ఉన్నాయి. మొదట టీజర్ గ్లింప్స్ బయటకి వచ్చింది. తర్వాత పాటలు కూడా లీక్ అయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో క్లిప్. సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ ఈ విషయమై నిర్మాతల పై మండిపడుతున్నారు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus