Sathyam Sundaram Collections: ‘సత్యం సుందరం’ 13 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • October 11, 2024 / 04:32 PM IST

కార్తీ (Karthi) , అరవింద్ స్వామి (Arvind Swamy)  కాంబినేషన్లో ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) (తమిళంలో మెయాజ్‌హ‌గ‌న్‌) అనే సినిమా రూపొందింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ ఇంప్రెస్ చేశాయి. తమిళంలో ’96’, తెలుగులో ‘జాను'(96 రీమేక్) వంటి సినిమాలు చేసిన సి ప్రేమ్ కుమార్  (C. Prem Kumar) ..దీనికి దర్శకుడు. సెప్టెంబర్ 27న తమిళంలో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. తెలుగులో ‘దేవర’ (Devara) వంటి పెద్ద సినిమా ఉండటంతో ఒకరోజు ఆలస్యంగా అంటే సెప్టెంబర్ 28న విడుదల చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘ఏషియన్ సురేష్’ సంస్థ విడుదల చేసింది.

Sathyam Sundaram Collections

మొదటి రోజు ఈ సినిమా తెలుగులో కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ‘దేవర’ పోటీగా ఉండటంతో.. కలెక్షన్స్ పర్వాలేదు అనే విధంగానే వచ్చాయి. అయితే 2వ వారం కూడా ఈ మూవీ స్టడీగా కలెక్ట్ చేస్తుంది. ఒకసారి (Sathyam Sundaram) 13 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.68 cr
సీడెడ్ 0.69 cr
ఉత్తరాంధ్ర 0.83 cr
ఈస్ట్+వెస్ట్ 0.43 cr
కృష్ణా + గుంటూరు 0.61 cr
నెల్లూరు 0.26 cr
ఏపి+ తెలంగాణ 4.50 cr

‘సత్యం సుందరం’ చిత్రానికి రూ.6.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 13 రోజుల్లో ఈ చిత్రం రూ.4.63 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ చిత్రం ఇంకా రూ.2.37 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. దసరా హాలిడేస్ ఉన్నప్పటికీ పోటీగా చాలా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి.. ‘సత్యం సుందరం’ పోటీలో బ్రేక్ ఈవెన్ సాధించడం అనేది కష్టమే అని చెప్పాలి.

ఆ నెలలో ఎన్టీఆర్, రిషబ్ శెట్టి సినిమాలు రిలీజ్ అవుతున్నాయట.. కానీ?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus